Begin typing your search above and press return to search.
సోషల్ మీడియాలో హాకింగ్ అకౌంట్ తెరిస్తే..?
By: Tupaki Desk | 16 April 2016 5:00 AM GMTఅచేతనస్తితిలో ఉంటూ సాంకేతిక సహాయంతో మాట్లాడే ప్రఖ్యాత భౌతిక శాస్త్రవేత్త స్టీఫెన్ హాకింగ్ సోషల్ మీడియాలో తన అకౌంట్ ను తెరిచారు. చైనాలో ఫేమస్ సోషల్ నెట్ వర్క్ అయిన ‘సినా వైబో’లో ఆయన తన అకౌంట్ ను తెరిచి.. రెండు పోస్ట్ లు చేశారు. హాకింగ్ అకౌంట్ తెరిచిన విషయం చైనాలో సందడిగా మారింది. కేవలం 24 గంటల వ్యవధిలో 20 లక్షల మందికి పైగా ఆయన్ను ఫాలో కావటం గమనార్హం.
తన జీవనం.. జీవన ప్రయాణం గురించి తన మొదటిపోస్ట్ లో పేర్కొన్న హాకింగ్ పోస్ట్ కు చైనీయుల నుంచి విశేష స్పందన లభించింది. ఆయన పోస్టింగ్ కు వేలాదిగా కామెంట్లు వచ్చాయి. ఇటీవల ఫేస్ బుక్ అధినేత మార్క్ జూకర్ బర్గ్ తో కలిసి గ్రహాంతరాల్లో ఉన్న నక్షత్ర మండలాలకు వ్యొమనౌకను పంపనున్న అంశానికి సంబంధించిన విశేషాలను హాకింగ్ తన రెండో పోస్ట్ లో వెల్లడించారు. గ్రహాంతర ప్రయాణానికి సంబంధించి నానో క్రాఫ్ట్ ను కనుగొన్నట్లుగా వెల్లడించారు. ఈ పోస్ట్ కి అనూహ్య స్పందన లభించింది. మొత్తంగా హాకింగ్ తెరిచిన సోషల్ మీడియా అకౌంట్ చైనాలో సందడిగా మారటమే కాదు.. అక్కడి సోషల్ మీడియాలో ఆయనో హాట్ టాపిక్ గా మారటం గమనార్హం.