Begin typing your search above and press return to search.
మహా మేధావికి ట్రంప్ దిగులు
By: Tupaki Desk | 21 March 2017 5:28 AM GMTసామాన్యులే కాదు.. ప్రముఖులు సైతం ట్రంప్ అంటే ఇబ్బంది పడే పరిస్థితి. తన వివాదాస్పద తీరుతో పలువురికి ఏ మాత్రం నచ్చని ట్రంప్ తీరు.. మహా మహా మేధావులకు సైతం ఆందోళన కలిగించేలా ఉండటం గమనార్హం. ట్రంప్ అనుసరిస్తున్న విధానాల నేపథ్యంలో.. తన లాంటి వ్యక్తిని కూడా అమెరికాకు ఆహ్వానించకపోవచ్చంటూ సంచలన వ్యాఖ్య చేశారు.. ప్రపంచంలోనే అత్యుత్తమ మేధావుల్లో ఒకరైన స్టీఫెన్ హాకింగ్. అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ ఉన్నంత కాలం తనను అమెరికాకు ఆహ్వానించకపోవచ్చన్న అభిప్రాయాన్ని ఆయన వ్యక్తం చేశారు. కదల్లేని అచేతన స్థితిలో ఉంటూ.. తన అభిప్రాయాల్ని ప్రత్యేక వ్యవస్థ ద్వారా వ్యక్తం చేసే హాకింగ్ తాజాగా ట్రంప్ పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
తనకెంతో ఇష్టమైన అమెరికాకు వెళ్లి.. అక్కడి శాస్త్రవేత్తలతో మాట్లాడాలని తాను అనుకుంటున్నానని.. అయితే అందుకు తగినట్లుగా తనకు ఆహ్వానం అందకపోవచ్చన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.
ట్రంప్ అధికారంలోకి రావటంపైనా.. విశ్లేషణ చేసిన హాకింగ్.. ప్రపంచీకరణపై వ్యతిరేకంగా ఉద్యమించే విషయంలో గత ప్రభుత్వం తమ హక్కుల్ని దూరం చేసిందని భావించిన అమెరికా ప్రజలు ట్రంప్ ను ఎన్నుకున్నట్లుగా చెప్పారు. బ్రెగ్జిట్ ను వ్యతిరేకించిన ఆయన.. ఐరోపా నుంచి బ్రిటన్ వైదొలగటం కారణంగా నష్టం వాటిల్లుతుందన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. అంతరిక్ష ప్రయాణం మీద ఆసక్తి ప్రదర్శించిన హాకింగ్.. తన కోరికను చెప్పిన వెంటనే అంతరిక్ష ప్రయాణానికి ఏర్పాట్లు చేస్తున్న రిచర్డ్ బ్రన్సన్ వెంటనే అంగీకరించారన్నారు. ఈ మహామేధావి అంతరిక్షంలోకి వెళ్లి అక్కడి పరిస్థితుల్ని స్వయంగా చూస్తే.. మరెన్ని కొత్త ఆలోచనల్ని పంచుకుంటారో..?
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/