Begin typing your search above and press return to search.

ఏలియన్స్ పిలిస్తే స్పందించొద్దు ప్లీజ్!

By:  Tupaki Desk   |   26 Sep 2016 4:45 AM GMT
ఏలియన్స్ పిలిస్తే స్పందించొద్దు ప్లీజ్!
X
గ్ర‌హాంత‌ర వాసులు గురించి ఎప్ప‌టిక‌ప్పుడు ఆస‌క్తిక‌ర‌మైన విష‌యాలు బ‌య‌ట‌కి వ‌స్తూ ఉంటాయి. ప్ర‌ముఖ భౌతిక శాస్త్రవేత్త స్టీఫెన్ హాకింగ్స్ తాజాగా అలాంటి ఆస‌క్తిక‌ర‌మైన విష‌యాల‌ను మ‌రోసారి చెప్పారు. గ్ర‌హాంత‌ర వాసుల నుంచి మ‌న‌కు సంకేతాలు వ‌చ్చే ప్ర‌మాదం ఉంద‌న్నారు. అంతేకాదు, వారు పంపించే సందేశాల‌కు మ‌నం స్పందించ‌కూడ‌ద‌న్నారు. ఎందుకంటే, ఏలియ‌న్స్ టెక్నాల‌జీ విష‌యంలో మ‌న‌కంటే ఎంతో ముందుకు వెళ్లి అభివృద్ధి సాధించి ఉంటార‌న్నారు. అన్నిర‌కాలుగా మ‌న‌కంటే ఎంతో ముందున్న‌వారితో ప‌రిచ‌యం చాలా ప్ర‌మాద‌క‌రం అని హాకింగ్స్ అభిప్రాయ‌ప‌డ్డారు. కొలంబ‌స్ ను అమెరిక‌న్లు మొట్ట‌మొద‌ట‌గా చూసిన‌ప్పుడు ఏం జ‌రిగిందో ఇదీ అటువంటిదే అవుతుంద‌ని ఆయ‌న అన్నారు. త‌న కొత్త షార్ట్ ఫిల్మ్ ‘స్టీఫెన్ హాకింగ్స్ సీక్రెట్ ప్లేసెస్’లో ఈ హెచ్చ‌రిక‌లు చేయ‌డం గ‌మ‌నార్హం.

భూమికి 16 కాంతి సంవ‌త్స‌రాల దూరంలో భూమిలాంటి మ‌రో గ్ర‌హం ఉంద‌న్నారు హాకింగ్స్‌. గ్లీజ్ 832-సి లాంటి గ్ర‌హాల నుంచి భూమ్మీదికి ఎప్పుడైనా సిగ్న‌ల్స్ వ‌చ్చే అవ‌కాశం ఉంద‌న్నారు. వాళ్లు మ‌న‌కంటే అత్యంత శ‌క్తిమంతులు కావొచ్చ‌న్నారు. మ‌నం బ్యాక్టీరియాలు ఎలా చూస్తామో.. వారు మ‌న‌ల్ని అలా ట్రీట్ చేసే అవ‌కాశం ఉండొచ్చ‌న్నారు. ఈ విశాల విశ్వంలో మ‌నం ఒంట‌రివారం కాద‌ని, ఇత‌ర గ్ర‌హాల్లో ఎక్క‌డో ఒక‌చోట జీవం క‌చ్చితంగా ఉంటుంద‌న్న విశ్వాసం త‌న‌కు ఇటీవ‌ల పెరుగుతోంద‌ని హాకింగ్స్ చెప్పారు.

అయితే, ఏలియ‌న్స్ గురించి హాకింగ్ హెచ్చ‌రిక‌లు ఇదే ప్ర‌థ‌మం కాదు. ఇంత‌కుముందు కూడా గ్ర‌హాంత‌ర వాసులు గురించి ఆయ‌న మాట్లాడారు. ఇప్పుడు హెచ్చ‌రించిన్ట‌టుగానే గ‌త ఏడాది కూడా హాకింగ్స్ స్పందించారు. భూమికి స‌మీపంలోని న‌క్షత్రాల‌పై జీవాన్ని గుర్తించ‌డానికి బ్రేక్ థ్రూ లిసెస్ ప్రాజెక్టు ప్రారంభిస్తున్న సంద‌ర్భంగా స్టీఫెన్ హాకింగ్స్ మాట్లారు. మ‌న సందేశాల‌ను స్వీక‌రించే గ్ర‌హాంత‌ర వాసులు మ‌న‌కంటే కొన్ని వంద‌ల కోట్ల సంవ‌త్స‌రాలు ఉండొచ్చ‌ని ఆయ‌న అభిప్రాయ‌ప‌డ్డారు.