Begin typing your search above and press return to search.
స్టీఫెన్‌సన్ కాల్‌డేటా మీద ఎందుకు దృష్టి పెట్టరు?
By: Tupaki Desk | 8 Jun 2015 9:00 AM GMTనేరం చేయటం ఎంతో.. నేరం చేసేలా పురికొల్పటం కూడా అలాంటిదే. ఓటుకు నోటు వ్యవహారంలో స్టీఫెన్‌సన్ పాత్ర ఏమిటన్న అంశంపై దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందని చెబుతున్నారు. స్టీఫెన్‌సన్‌ను తెలంగాణ తెలుగుదేశం నేతలు ప్రలోభ పెట్టటానికి ప్రయత్నించారా? లేక.. స్టీఫెన్‌సన్ ముందస్తు వ్యూహంలో భాగంగా ఉచ్చు బిగించి..అందులో ఇరికించే ప్రయత్నం చేశారా? అన్నది కూడా తేలాల్సి ఉంది.
దీనిపై ఇప్పటివరకూ ఎవరూ దృష్టి సారించటం లేదు. ఓటుకు నోటు వ్యవహారంలో నిందితులుగా నమోదు చేసిన వారి ఫోన్‌కాల్ డేటాను పరిశీలిస్తున్న అధికారులు.. ఈ కేసు మొత్తానికి కర్మ.. కర్త.. క్రియ లాంటి స్టీఫెన్‌సన్ ఫోన్‌కాల్ డేటాను పరిశీలించాలంటూ డిమాండ్ చేయాలని నిపుణులు సూచిస్తున్నారు.
స్టీఫెన్‌సన్ ఎవరి ప్రోద్భలంతోనే ఇదంతా చేశారా? లేక తనకు తానుగా చేశారా? అన్నది కూడా తేలాల్సి ఉంది. అంతేకాదు.. స్టీఫెన్‌సన్ కనుక ఎవరితోనైనా మాట్లాడి.. ఒక వ్యూహాం ప్రకారం.. తమ రాజకీయ ప్రత్యర్థులకు ఎర వేసి వారిని ఉచ్చులోకి దించారా? అన్నది కూడా చూడాలి. ఒకవేళ అలాంటిదే ఉంటే.. నేరం చేసే దిశగా ఉసిగొల్పిన అంశాన్ని పరిగణలోకి తీసుకోవాల్సి ఉంటుందని చెబుతున్నారు. మరి.. ఈ విషయంపై ఏపీ అధికారులు దృష్టి సారించాలని కోరుతున్నారు.