Begin typing your search above and press return to search.
పిశాచి పినతల్లికి రిమాండ్
By: Tupaki Desk | 10 July 2015 5:03 AM GMTసవతితల్లి ఆరళ్లు ఎంత దారుణంగా ఉంటాయన్న విషయాన్ని కళ్లకు కట్టినట్లుగా చూపించిన పిశాచి పినతల్లి చాముండేశ్వరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. తన సవితితల్లి పాశవిక చర్యలతో అత్యంత దారుణ పరిస్థితుల్లో ఉన్న పందొమిదేళ్ల ప్రత్యూష ఉదంతం తెలిసిందే. యాసిడ్ తాగిస్తూ.. ఇనుప సువ్వలతో గాయపరిచి.. ఒళ్లంతా పుండు చేసేసి.. ఏడాదిగా చిత్రహింసలకు గురి చేస్తున్న పిశాచిలాంటి పినతల్లిని పోలీసులు అదుపులోకి తీసుకొని న్యాయస్థానం ముందు హాజరుపరిచారు.
అనంతరం ఆమెను న్యాయమూర్తి ఆదేశాల మేరకు రిమాండ్‌కు తరలించారు. ఇక.. తన రెండో భార్య చేస్తున్న దారుణాల్ని చూస్తూ ఊరుకున్న బీఎస్‌ఎన్‌ఎల్ ఉన్నతోద్యోగి రమేష్ కోసం పోలీసులు గాలింపు చర్యలు మరింత ముమ్మరం చేశారు. అతగాడిపై పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేసిన పోలీసులు.. అతని ఆచూకీ కోసం తీవ్రంగా గాలిస్తున్నారు.
ఇక.. ప్రత్యూషను ఎందుకింత దారుణంగా హింసించారన్న దానిపై చెబుతున్న సమాచారం వింటే విస్మయానికి గురి కాక మానదు. తన కూతురు ప్రత్యూషకు ఆస్తి ఇవ్వాల్సి వస్తుందన్న ఉద్దేశ్యంతో ఆమెను చిత్రహింసలకు గురి చేసి.. అంధవిహీనురాలిగా చేస్తే.. పెళ్లి కాకుండా ఉంటుందని.. అప్పుడు తను ఆస్తి ఇవ్వాల్సి ఉండదన్న ఉద్దేశ్యంతో ఇలాంటి దుశ్చర్యలకు పాల్పడినట్లుగా చెబుతున్నారు. ఆస్తి కోసం కన్న కూతుర్ని ఇంత దారుణంగా హింసిస్తారా?