Begin typing your search above and press return to search.

ఐఫోన్ 14పై స్టీవ్ జాబ్స్ కుమార్తె సెటైర్స్.. వైరల్

By:  Tupaki Desk   |   8 Sep 2022 3:53 PM GMT
ఐఫోన్ 14పై స్టీవ్ జాబ్స్ కుమార్తె సెటైర్స్.. వైరల్
X
ఐఫోన్.. అందరి కలల ఫోన్. ఈ ఫోన్ కోసం ప్రపంచవ్యాప్తంగా వినియోగదారులు ఎగబడుతారు. ప్రతీ కొత్త మోడల్ కు అప్టేట్ తో అత్యాధునిక ఫీచర్లతో ఐఫోన్ ను విడుదల చేస్తారు. దీంతో పాత ఫోన్లన్నింటిని సెకండ్ హ్యాండ్ కు అమ్మేసి కొత్త ఫోన్ ను కొంటుంటారు. ఈ క్రమంలోనే టెక్ అభిమానులంతా ఆసక్తిగా ఎదురుచూసిన ఐఫోన్ 14 తాజాగా గ్రాండ్ గా రిలీజ్ అయ్యింది. అందరూ ఈ ఫోన్ ఫీచర్లు చూసి ఆశ్చర్యపోతున్న వేళ.. ఐఫోన్ వ్యవస్థాపకుడు స్టీవ్ జాబ్స్ కుమార్తె ఈవ్ జాబ్స్ మాత్రం సెటైర్లు వేసింది. ఇదే ఇప్పుడు ఇంటర్నెట్ లో హాట్ టాపిక్ గా మారింది. ఐఫోన్ తయారీదారు కూతురే ఇలా ఊహించని విధంగా మీమ్ ను పోస్ట్ చేయడంతో మీడియాలో మీమ్ ఫెస్టివల్ మొదలైంది.

స్టీవ్ జాబ్స్ కుమార్తె ఈవ్ జాబ్స్ తన ఇన్ స్టాగ్రామ్ లో ఆపిల్ ఐఫోన్ , 13, 14ని పోలుస్తూ ఒక స్టోరీ పోస్ట్ చేసింది. దీంతో నెటిజన్లు ఫన్నీగా ఒక కామెంట్ చేస్తున్నారు. ఆపిల్ ప్రకటన తర్వాత ఐఫోన్ 14ను అప్ డేట్ చేసుకుంటున్నా అని క్యాప్షన్ తో ఒక పోస్ట్ పెట్టారు. ఐఫోన్ 13తో పోలిస్తే కొత్త ఐఫోన్ 14 పెద్దగా అప్ డేట్ ఏమీ లేదంటూ ఐఫోన్ లవర్స్ పెదవి విరుస్తున్న సందర్భంలో ఈవ్ పోస్ట్ చర్చకు దారి తీసింది.

మరోవైపు అమెరికాలోని ఐఫోన్ మోడల్స్ లో ఈ-సిమ్ యాక్టివేషన్స్ పై కూడా యూజర్లు అసంతృప్తిగా ఉన్నారు. తాజా అప్ డేట్స్ పై సోషల్ మీడియాలో మీమ్స్ ఓ రేంజ్ లో పేలుతున్నాయి.త్వరలోనే ఐఫోన్ ఈఫోన్ అవుతుందని మరొకరు కామెంట్ చేశారు. తాము ఈసిమ్ లకు సిద్ధంగా లేము అంటూ ఇంకో యూజర్ కామెంట్ చేశాడు.

కాలిఫోర్నియాలోని యాపిల్ పార్క్ ప్రధాన కార్యాలయంలో జరిగిన లాంచ్ ఈవెంట్‌లో కొత్త ఆపిల్ ఐఫోన్ 14, యాపిల్ వాచ్ అల్ట్రాలను రిలీజ్ చేశారు. ఈ ఈవెంట్ లో టెక్ దిగ్గజం యాపిల్ ఐఫోన్ 14, ఐఫోన్ 14 ప్లస్, యాపిల్ వాచ్ అల్ట్రా, కొత్త ఎయిర్ పాడ్స్ ప్రో, యాపిల్ వాచ్ సిరీస్ 8, ఆపిల్ వాచ్ ఎస్.ఈ ప్రకటించింది.

భారీ అప్‌గ్రేడ్‌ తో అత్యాధునిక ఫీచర్లతో ఇవి అందుబాటులోకి వచ్చాయి. Apple iPhone 14 Pro క్వాడ్-పిక్సెల్ సెన్సార్‌తో కొత్త 48 ఎంపీ కెమెరాను కలిగి ఉంటుంది. ఐఫోన్ 14 ప్రోతో తక్కువ కాంతి ఫోటోలు 2 రెట్లు మెరుగ్గా తీయవచ్చు.. 2X టెలిఫోటో ఎంపిక కూడా ఉంది. దీనిధర $999 డాలర్ల నుండి ప్రారంభమవుతుంది.యాపిల్ ఐఫోన్ 14 ప్రో కొత్త ‘Apple ProRAW’ని ఉపయోగించి 48ఎంపీ కెమెరాతో ఏకంగా సినిమాను షూట్ చేయడానికి వీలుగా రూపొందిందారు. ఇది వినియోగదారులకు అద్భుత అనుభూతి కలిగిస్తోంది. అల్ట్రా-వైడ్ కెమెరా లైట్ క్యాప్చర్ మరియు మెరుగైన మాక్రో ఫోటోలలో 3x మెరుగుదలను కలిగి ఉంది.

ఆపిల్ ఐఫోన్ 14కి శాటిలైట్ ఎమర్జెన్సీ సర్వీస్ ఫీచర్‌ని జోడిస్తుంది. యాపిల్ ఐఫోన్ 14 సెప్టెంబర్ 16 మరియు ఐఫోన్ 14 ప్లస్ అక్టోబర్ 7న విడుదల అవుతుంది. ఐఫోన్ 14, ఐఫోన్ 14 ప్లస్ ధర $799 డాలర్లు మరియు ప్లస్ $899 డాలర్లుగా ఉంటుంది.

నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.