Begin typing your search above and press return to search.
హిల్లరీ గెలుపు లెక్క చెప్పేశారు
By: Tupaki Desk | 20 Oct 2016 4:22 AM GMTనువ్వా నేనా అన్నట్లుగా సాగుతున్న అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో విజయం సాధించేది ఎవరన్నప్రశ్నకు.. హిల్లరీ క్లింటన్ అని అందరూ చెబుతున్నదే. ఆమె విజయంపై ఎవరికి ఎలాంటి సందేహాల్లేవు. కాకుంటే.. ఆమె విజయం ఎలా ఉంటుంది? ఎంత భారీగా ఉంటుంది? ఆమె విజయం సాధిస్తారా? అద్భుత విజయాన్ని నమోదు చేస్తారా? లాంటి ప్రశ్నలకు సరైన సమాధానాలు కనిపించని పరిస్థితి. అయితే.. దానికి సంబంధించిన వివరాలు తాజాగా బయటకు వచ్చేశాయి.
అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో కీలకమైన పోలింగ్ రోజు దగ్గల్లోకి వచ్చేసిన వేళ.. మూడో బిగ్ డిబేట్ కు ముహుర్తం ముగిసిన వేళ.. గెలుపు గుర్రాలు ఎవరన్న అంశంపై పలు మీడియా సంస్థలు నిర్వహించిన సర్వేల్లో హిల్లరీ క్లింటన్ గెలుపు పక్కా అయింది. హిల్లరీ విజయం ఎంత భారీగా ఉంటుందన్న విషయాన్ని సొంత పార్టీ నేతల కంటే.. ఆమె ప్రత్యర్థి పార్టీకి చెందిన రిపబ్లికన్ల వ్యూహకర్త స్టీవ్ స్కిమిట్ ఆమె విజయం ఎంత భారీగా ఉంటుందన్న విషయాన్ని చెప్పేశారు. ఆమెకు ఏకంగా 400ఎలక్టోరల్ కాలేజీ ఓట్లు వస్తాయని చెప్పటం గమనార్హం.
అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో 538 ఓట్లు ఉండగా.. విజయం సాధించి అధ్యక్ష పీఠం అధిష్టించాలంటే 270 ఓట్లు వస్తే సరిపోతుంది. అయితే.. హిల్లరీ 7.2 శాతం పాయింట్ల అధిక్యతతో ఉన్నట్లుగా రియల్ క్లియర్ పిక్చర్స్ సంస్థ అంచనా వేసింది. హిల్లరీకి 256 ఓట్లు పక్కా అని.. ట్రంప్ 176 ఓట్లు సాధిస్తారని.. మిగిలిన 112 సీట్లలో 14 ఓట్లు హిల్లరీ సొంతం చేసుకుంటే సరిపోతుందని తేల్చింది.
హిల్లరీకి గెలుపు అవకాశాలు 92 శాతం ఉన్నట్లుగా ప్రఖ్యాత మీడియా సంస్థ న్యూయార్క్ టైమ్స్ తేల్చి చెప్పగా.. బ్లూమ్ బెర్గ్ పోల్ ప్రకారం ట్రంప్ కంటే హిల్లరీ 9 పాయింట్లు అధిక్యంలో ఉన్నట్లు తేలింది. ఇక.. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో కీలక భూమిక పోషించే భారత సంతతి అమెరికన్లలో అత్యధికులు హిల్లరీ వెంటే ఉన్నట్లుగా తేల్చారు. సో.. ఏతావాతా చెప్పొచ్చేదేమంటే.. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో హిల్లరీ విజయం పక్కా అన్న మాట.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/