Begin typing your search above and press return to search.
ట్యాంపరింగ్ లొల్లి.. క్లారిటీ ఇచ్చిన అసీస్ కెప్టెన్
By: Tupaki Desk | 10 Jun 2019 10:59 AM GMTఇండియాతో ముగిసిన మ్యాచ్ లో భారత్ గెలిచినా వివాదాలు మాత్రం తగ్గడం లేదు. మ్యాచ్ సందర్భంగా అసీస్ స్పిన్నర్ ఆడమ్ జంపా వ్యవహారశైలి కెమెరాకు చిక్కింది. అతడు భారత బ్యాట్స్ మెన్ కు బంతులేసే ముందు ప్రతీసారి తన జేబులో చేయి పెట్టుకోవడం.. అనంతరం బంతులేయడం చేశాడు. అయితే అలా చేతిలో పెట్టుకోవడం వైరల్ అయ్యింది. దీనిచూసిన వారందరూ అతడు ట్యాంపరింగ్ కు పాల్పడ్డాడని విమర్శలు గుప్పించారు.
ఇన్నింగ్స్ 14వ ఓవర్ లో బౌలింగ్ కు వచ్చిన ఆడమ్ జంపా ప్రతి ఓవర్ లోనూ ఇలాగే వ్యవహరించారు. దీంతో జంపా బాల్ ను షేప్ మార్చేందుకే ఇలా చేశాడని విమర్శలు వెల్లువెత్తాయి. దీనికి సంబంధించిన ఫొటోలు, వీడియోలను తీసుకొని టీమీండియా ఫ్యాన్స్ పెద్ద ఎత్తున షేర్లు చేశారు. అతడిపై చర్య తీసుకోవాలని ఐసీసీకి విన్నవించారు.
ఆడమ్ జంపా ట్యాంపరింగ్ వివాదం శృతి మించడంతో ఆస్ట్రేలియా కెప్టెన్ ఆరోన్ ఫించ్ స్పందించాడు.. ఆడమ్ జంపా ట్యాంపరింగ్ చేస్తున్న వచ్చిన ఫొటోలు, వీడియోలు చూసి అందరూ విమర్శలు చేయవద్దని ఫించ్ పేర్కొన్నారు. జంపా అలా చేయడానికి కారణముందని వెల్లడించారు. ప్రతి మ్యాచ్ కు జంపా తన జేబులో హ్యాండ్ వార్మర్ (వేడి చేసుకొనే యంత్రం) ను ఉంచుకుంటాడని.. తేమ కారణంగా బంతిపై పట్టు చిక్కకపోతే చేతిని వేడి చేసుకొని ఇలా బంతులేస్తుంటాడని ఫించ్ పేర్కొన్నారు. భారత్ పై మ్యాచ్ లోనూ జేబులో హ్యాండ్ వార్మర్ పెట్టుకొని బంతులేశాడని ఫించ్ క్లారిటీ ఇచ్చాడు. ఇది ఎంత మాత్రం ట్యాంపరింగ్ మాత్రం కాదని ఫించ్ వివరణ ఇచ్చాడు.