Begin typing your search above and press return to search.
టాంపరింగ్ దెబ్బ.. ఇద్దరికి వంద కోట్ల నష్టం
By: Tupaki Desk | 29 March 2018 11:06 AM GMTఒక్క క్షణంలో జీవితాలు మారిపోతుంటాయి. ఒక్క నిర్ణయంతో పరిస్థితి తల్లకిందులు అవుతుంటుంది. అనాలోచితంగా చేసే ఒక తప్పిదం ఎలాంటి పరిణామాలకైనా దారి తీస్తుంది. ఇందుకు ఆస్ట్రేలియా క్రికెటర్ల బాల్ టాంపరింగ్ ఉదంతమే నిదర్శనం. ఈ వివాదం ఆస్ట్రేలియా క్రికెటర్లకు.. ఆ దేశ క్రికెట్ వ్యవస్థకు మామూలు దెబ్బ కాదు దీని వల్ల వార్నర్ - స్మిత్ ల కెరీర్లే తల్లకిందులైపోయే పరిస్థితి వచ్చింది. నిన్నటిదాకా గొప్ప ఆటగాళ్లుగా ప్రపంచం చేత కీర్తించబడ్డ వీళ్లిద్దరూ ఇప్పుడు మోసగాళ్లుగా ముద్ర వేసుకున్నారు. దీని వల్ల వీళ్లకు జరిగిన నష్టం ఇంత అని కొలిచి చెప్పలేం. ఆర్థికంగా వీళ్లిద్దరికీ కలిపి రూ.100 కోట్ల దాకా నష్టం వాటిల్లి ఉంటుందని అంచనా.
క్రికెట్ ఆస్ట్రేలియా వార్నర్ - స్మిత్ లపై ఏడాది పాటు నిషేధించిన సంగతి తెలిసిందే. దీని వల్ల బోర్డు కాంట్రాక్టు ద్వారా వచ్చే ఆదాయం ఆగిపోతుంది. దీంతో పాటు మ్యాచ్ లు ఆడటం ద్వారా వచ్చే కోట్ల రూపాయలూ పోతాయి. ఈ రూపంలోనే వీళ్లు తలో రూ.15-20 కోట్ల దాకా నష్టపోయే అవకాశముంది. ఇక వారి వ్యక్తిగత స్పాన్సర్లు ఆటోమేటిగ్గా దూరమవుతారు. దీని ద్వారా కూడా భారీగా ఆదాయం పోతుంది. ఇక ఐపీఎల్ సీజన్ కు కూడా దూరమవుతున్నారు కాబట్టి చెరో రూ.12.5 కోట్ల ఆదాయం పోగొట్టుకుంటారు. ఇలా టాంపరింగ్ ఉదంతం పుణ్యమా అని తలో రూ.50 కోట్లయినా నష్టపోతారనడంలో సందేహం లేదు. ఇక దీని వల్ల వచ్చిన చెడ్డ పేరు వారికి అతి పెద్ద ప్రతికూలత. ఇన్నాళ్లూ ఎంతో గౌరవంగా సాగిన జీవితం ఇక దుర్భరంగా మారుతుంది. వాళ్లను ప్రతిచోటా అదోలా చూస్తారు. ఎవ్వరూ ఏ కార్యక్రమానికీ పిలవరు. ఏడాది పాటు ఇంటిపట్టునే ఉండాల్సి ఉంటుంది. నిన్నటిదాకా గౌరవించిన ప్రపంచం ఒక్కసారిగా మోసగాడిగా చూస్తే ఎలాంటి మానసిక స్థితి ఉంటుందో మాటల్లో చెప్పలేం. దీన్ని తట్టుకుని నిలబడటం మామూలు విషయం కాదు. దీని వల్ల వాళ్ల కెరీర్లే ప్రమాదంలో పడ్డా ఆశ్చర్యం లేదు.