Begin typing your search above and press return to search.

ఆస్ట్రేలియా కెప్టెన్ మోకాళ్లపై నిలబడి..

By:  Tupaki Desk   |   29 Jun 2017 12:57 PM GMT
ఆస్ట్రేలియా కెప్టెన్ మోకాళ్లపై నిలబడి..
X
భారత స్టార్ క్రికెటర్లు పెళ్లి చేసుకోవడానికి కొంచెం ఎక్కువ సమయమే తీసుకుంటారు. యువరాజ్ సింగ్.. హర్భజన్ సింగ్ ఎంత లేటుగా పెళ్లాడారో తెలిసిందే. జహీర్ ఖాన్ ఇంకా కూడా పెళ్లి చేసుకోలేదు. ఈ తరం క్రికెటర్లలో విరాట్ కోహ్లికి 27 ఏళ్లు నిండుతున్నా ఇంకా పెళ్లాడలేదు. అనుష్కతో కమిటైనప్పటికీ ఆమెనే పెళ్లి చేసుకుంటాడా.. చేసుకుంటే ఎప్పుడు అన్నది తెలియదు. ఐతే కోహ్లి సమకాలీనుడు.. అతడి లాగే మేటి బ్యాట్స్ మన్ అయిన ఆస్ట్రేలియా కెప్టెన్ స్టీవెన్ స్మిత్ మాత్రం పెళ్లికి రెడీ అయిపోయాడు. తన ప్రేయసి డానీ విల్లిస్ తో అతడి ఎంగేజ్మంట్ కూడా పూర్తయింది.

డానీతో స్టీవ్ స్మిత్ ఐదేళ్లుగా ప్రేమలో ఉండటం విశేషం. గురువారమే అతను ఆమెకు పెళ్లి ప్రతిపాదన చేశాడు. ఆమె అంగీకరించింది. దీన్నే తమ ఎంగేజ్మెంట్ గా భావిస్తున్నట్లు స్మిత్ తెలిపాడు. ‘‘ఈ రోజు డానీ ముందు ఒక మోకాలిపై కూర్చొని పెళ్లి ప్రతిపాదన చేశా. నా అభ్యర్థనకు డానీ ఒప్పుకుంది. ఇక మా నిశ్చితార్ధం అయిపోయినట్లే’’ అని స్మిత్ ఇన్ స్టాగ్రామ్ అకౌంట్లో పేర్కొన్నాడు. డానీతో కలిసి ఉన్న ఫొటోను కూడా అతను షేర్ చేశాడు. 2012 బిగ్ బాష్ లీగ్ సందర్భంగా డానీతో స్మిత్ ప్రేమలో పడ్డాడు. డానీతో తన అనుబంధం గురించి స్మిత్ చెబుతూ.. తాను ఎక్కడికి వెళ్లినా డానీ తన వెంటే ఉన్నట్లు ఉంటుందని.. తన జీవితానికి సంబంధించి డానీ ఇచ్చే సూచనలు తనకెంతో ఉపయోగకరంగా ఉంటాయని.. ఆమె చాలా నిజాయితీ గల అమ్మాయని.. ఆమెలో తనకు నచ్చే గుణం అదేనని స్మిత్ తెలిపాడు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/