Begin typing your search above and press return to search.
ఐపీఎల్ అంతా డబ్బు చుట్టే ... అక్కడ ఆటకు ప్రాధాన్యం లేదు..!
By: Tupaki Desk | 3 March 2021 7:30 AM GMTదక్షిణాఫ్రికా స్టార్ పేసర్ స్టెయిన్ లీగ్ ఐపీఎల్‌పై సంచలన ఆరోపణలు చేశారు. స్టెయిన్ గత ఏడాది వరకు ఐపీఎల్లో ఆడిన విషయం తెలిసిందే. ఐపీఎల్ ప్రారంభం నుంచి గత ఏడాది సీజన్ వరకు స్టెయిన్ ఐపీఎల్లో ఆడాడు. అయితే ప్రస్తుతం ఇతడు పాకిస్థాన్ సూపర్ లీగ్‌లో ఆడుతున్నాడు. ఈ సందర్భంగా ఓ యూట్యూబ్ చానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో స్టెయిన్ మాట్లాడుతూ.. ఐపీఎల్ మొత్తం డబ్బు చుట్టే తిరుగుతుందని అన్నారు. ఏ ఆటగాడు ఎంతకు అమ్ముడుపోయాడు.. ఈ ప్రాంచైజీ ఎంత మొత్తం వెచ్చించింది.. ఇలా అక్కడంతా డబ్బు మీద చర్చ నడుస్తుందని ఆట గురించి ఎవరూ పట్టించుకోరని అన్నారు.
ఐపీఎల్ కంటే పాకిస్థాన్ సూపర్ లీగ్ (పీఎస్‌ఎల్), శ్రీలంక ప్రీమియర్ లీగ్ (ఎల్‌పీఎల్) ఎంతో బాగుంటాయని ప్రశంసించాడు. వాటిలో డబ్బు కంటే ఆటగాళ్లకు గుర్తింపు ఎక్కువని చెప్పుకొచ్చారు. ప్రస్తుతం స్టెయిన్ పాకిస్థాన్ సూపర్ లీగ్ లో ఆడేందుకు కరాచీలో ఉన్నాడు. ఈ సందర్భంగా యూట్యూబ్ ఛానల్ తో మాట్లాడాడు. 'పాకిస్థాన్ సూపర్ లీగ్, శ్రీలంక ప్రీమియర్ లీగ్‌లో ఆటగాడిగా ఎక్కువ గుర్తింపు దక్కుతుంది.
ఇండియన్ ప్రీమియర్ లీగ్ విషయానికొస్తే.. అక్కడ పెద్దపెద్ద జట్లుంటాయి. పేరున్న ఆటగాళ్లు ఉంటారు. ఎవరికెంత ఇస్తున్నారు అనే దానిపైనే చర్చ సాగుతుంది. అంతేతప్ప క్రికెట్‌పై చర్చ ఉండదు అని పేర్కొన్నాడు.అయితే స్టెయిన్ తీరుపై నెటిజన్లు విమర్శలు గుప్పిస్తున్నారు. ఇంతకాలం ఐపీఎల్లో ఆడి ఇప్పుడు విమర్శలు గుప్పించడం ఏమిటని మండిపడుతున్నారు.