Begin typing your search above and press return to search.

రోజులో రూ.3ల‌క్ష‌ల కోట్లు ఆవిరి అయిపోయాయి!

By:  Tupaki Desk   |   12 Oct 2018 4:20 AM GMT
రోజులో రూ.3ల‌క్ష‌ల కోట్లు ఆవిరి అయిపోయాయి!
X
కాలం ఎంత మారినా.. రూపాయి విలువ అంత‌కంత‌కూ క్షీణిస్తున్నా.. నేటికీ ల‌క్ష రూపాయిలు సంపాదించ‌టం ఎంత క‌ష్ట‌మో సామాన్యుడి నుంచి మ‌ధ్యత‌ర‌గ‌తి వ‌ర‌కూ అంద‌రికి ఎరుకే. అలాంటిది ఏకంగా రూ.3ల‌క్ష‌ల కోట్ల సంప‌ద‌.. గంట‌ల వ్య‌వ‌ధిలో ఆవిరైపోవ‌టం చూస్తే.. ఇంత మాయాజాలం మ‌రెక్క‌డా క‌నిపించ‌దంతే.

రూ.3వేల కోట్ల మొత్తం ఆవిరి కావ‌టం.. అది కూడా ఎలాంటి విధ్వంసం లేకుండా.. ర‌క్తం బొట్టు చింద‌కుండా.. జ‌ర‌గ‌టం చూసిన‌ప్పుడు గుండెలు అదిరిపోతాయి. ఇలాంటివి స్టాక్ మార్కెట్లో త‌ప్పించి మ‌రెక్క‌డా క‌నిపించ‌దు. నిజానికి రూ.3ల‌క్ష‌ల కోట్ల సంప‌దకు న‌ష్టం వాటిల్లిందంటే దాని విల‌యాన్ని త‌ట్టుకోలేరు. ల‌క్ష‌లాది మందిని ప్ర‌భావితం చేసే స‌త్తా ఈ మొత్తానికి ఉంది. కానీ.. అలాంటిదేమీ లేకుండా.. కేవ‌లం దాని ప్ర‌భావం ఆర్థిక వ్య‌వ‌స్థ మీద ప్ర‌భావం చూపించే గుణం స్టాక్ మార్కెట్‌ కుంది.

ఇటీవ‌ల కాలంలోఅదే పనిగా షేర్లు ప‌డిపోవ‌టం.. మార్కెట్ త‌ర‌చూ ప్ర‌భావితం కావ‌టం.. బేర్ రంకెలేస్తూ.. స్టాక్ మార్కెట్ లో చేస్తున్న‌ వీర విహారంతో సెన్సెక్స్ లు ఢమాల్ అవుతున్నాయి. ఎప్ప‌టి విష‌యాలో ఎందుకు? గురువారం సంగ‌తే చూస్తే. సెన్సెక్స్ విలువ భారీగా ప‌డిపోవ‌టంతో దాదాపు రూ.3 ల‌క్ష‌ల కోట్ల మ‌దుపరుల సొమ్ము ఆవిరైపోయిన ప‌రిస్థితి. ఒక ద‌శ‌లో వెయ్యి పాయింట్లు ఎఫెక్ట్ అయిన సెన్సెక్స్.. ఆ త‌ర్వాత రిక‌వ‌రీ అయిన‌ప్ప‌టికీ.. ఆవిరైన సొమ్ము రిక‌వ‌రీ ఇప్ప‌ట్లో సాధ్య‌మ‌య్యే వాతావ‌ర‌ణం క‌నిపించ‌టం లేద‌ని చెబుతున్నారు.

తాజా బేర్ పుణ్య‌మా అని సెన్సెక్స్ 34వేల మార్క్‌కు త‌క్కువ‌కు ప‌డిపోయింది. దీంతో ట్రేడింగ్ లో పాల్గొన్న కంపెనీల మార్కెట్ కాపిట‌లైజేష‌న్ బారీగా ఎఫెక్ట్ అయ్యింది. భారీగా ప‌త‌న‌మైన సెన్సెక్స్ మ‌ళ్లీ కోలుకోవ‌టానికి ఎంత కాలం ప‌డుతుందో అర్థం కాని ప‌రిస్థితి.ఇదిలా ఉంటే.. అదే ప‌నిగా విలువ కోల్పోతున్న రూపాయి మ‌రోసారి త‌న విలువ‌ను త‌గ్గించుకుంది. డాల‌ర్ తో రూపాయి మార‌కం విలువ తాజాగా మ‌రింత‌గా కుంగిపోయింది. రికార్డు స్థాయిలో ప‌డిపోయిన రూపాయి విలువ చ‌రిత్ర‌లోనే క‌నిష్టంగా రూ.74.45కు ప‌డిపోయింది. దేశం వెలిగిపోతోంది..మోడీ వ‌చ్చాక ఆర్థిక ప‌రిస్థితి భారీగా మెరుగుప‌డింద‌న్న మాట‌లు చెప్పే మోడీ బ్యాచ్‌.. రూపాయి విలువ ఎంత‌వ‌ర‌కూ దిగ‌జారుస్తారన్న‌ది ఇప్పుడు పెద్ద సందేహంగా మారింద‌ని చెప్ప‌క త‌ప్ప‌దు.