Begin typing your search above and press return to search.
స్టాక్ మర్కెట్స్ కు కరోనా కష్టాలు - బేర్ లోకి ఎంట్రీ..!
By: Tupaki Desk | 13 March 2020 8:18 AM GMTకరోనా వైరస్ దెబ్బకి గతంలో ఎన్నడు లేనంతగా స్టాక్ మర్కెట్స్ పతనం దిశగా సాగుతున్నాయి. కరోనా వైరస్ పలు దేశాలకు వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో స్టాక్ మార్కెట్లలో మదుపరులను ప్రభావితం చేసింది. కొద్ది రోజుల క్రితం 42,000 దాటి చూసిన సెన్సెక్స్ ఇప్పుడు 33,000కు దిగువన ఉంది. నిఫ్టీ కూడా 10,000కు దిగువన ఉంది. అమెరికా - జపాన్ - చైనా.. ఇలా ఆ దేశం ఈ దేశం అనకుండా ప్రపంచవ్యాప్తంగా మార్కెట్లు కుప్పకూలిపోయాయి. ఇప్పటికే అమెరికా బేర్ మార్కెట్ పరిధిలోకి వెళ్లాయి. నిఫ్టీ కూడా బేర్ మార్కెట్ పరిధిలోకి చేరింది.
అసలు బేర్ మార్కెట్ అంటే ఏమిటి.. అమ్మకాలు ఎక్కువగా జరిగే వాటిని బేర్ మార్కెట్ అంటారు. ఏదైనా ఒక స్టాక్ లేదా సూచీ ఇటీవలి కాలంలో అత్యధికంగా ట్రేడైన తర్వాత ఆ మార్క్ నుండి 20 శాతం కిందకు పడిపోతే దానిని బేర్ మార్కెట్ గా వ్యవహరిస్తారు. సూచీలు లేదా స్టాక్స్ లో భారీ అమ్మకాలకు ఇది సూచిక చెప్పవచ్చు. గురువారం నాటి భారీ నష్టాల నేపథ్యంలో నిఫ్టీలో 43 స్టాక్స్ బేర్ మార్కెట్ పరిధిలోకి ఎంటర్ అయ్యాయి. HDFC బ్యాంకు - బజాజ్ ఫైనాన్స్ - టీసీఎస్ - రిలయన్స్ ఇండస్ట్రీస్ వంటి పెద్ద కంపెనీలు కూడా ఈ పరిధిలోకి వచ్చాయి. ఉదయం నిఫ్టీ 50లోని 43 బేర్ మార్కెట్ పరిధిలో ఉన్నాయి. ఈ కంపెనీల స్టాక్స్ 20 శాతం పైగా పడిపోయాయి.
నిఫ్టీ బ్యాంకు - నిఫ్టీ మెటల్ - నిఫ్టీ ఆటో - నిఫ్టీ సీపీఎస్ ఈ లు ఇప్పటికే బేర్ మార్కెట్లో ఉన్నాయి. ఇవన్నీ కూడా ఇటీవల ట్రేడ్ అయిన అత్యధిక మొత్తం కంటే 20 శాతం కంటే పైగా పడిపోయాయి. అమెరికాలో కూడా బేర్ మార్కెట్లోకి ప్రవేశించాయి. 2008 ఆర్థిక సంక్షోభం తర్వాత మరోసారి అమెరికా కూడా ఈ పరిస్థితిలోకి ఎంట్రీ ఇచ్చింది. ఇక అసలు విషయానికొస్తే ..ప్రస్తుతం మార్కెట్లు భారీ నష్టాల్లో ఉన్నాయి. తక్కువగా షేర్లు వస్తున్నాయని కొనుగోలు చేయాలా లేక నష్టాల్లో ఉన్నాయని ఊరుకోవాలా అనే అనుమానం అందరిలో మొదలైంది.
ఇలాంటి సమయాల్లో కొనుగోలు చేయకపోవడమే మంచిదని మార్కెట్ నిపుణులు సూచిస్తుంటారు.ఇప్పటికే షేర్లను కొనుగోలు చేసినవారు తమ సంపదను కోల్పోయి ఉంటారు. వీటిని అమ్మితే వచ్చేదేమీ ఉండదు. కానీ దీర్ఘకాలిక పెట్టుబడిదారు అయితే ఇది మంచి అవకాశం. అయితే , ప్రతి షేర్ మళ్లీ పైకి వస్తుంది అని చెప్పలేము కానీ ,నిలకడగా ఉండే కంపెనీల షేర్లు మాత్రం కొనుగోలు చేస్తే దీర్ఘకాలంలో లాభదాయకమే. తక్కువ రేటుకు మంచి కంపెనీల షేర్లు కొనుగోలు చేయవచ్చు. కానీ, అప్రమత్తంగా లేకపోతే మాత్రం పూర్తిగా నష్టపోవడం ఖాయం.