Begin typing your search above and press return to search.
యూపీ విజయం..1.31లక్షల కోట్లు తెచ్చిపెట్టింది
By: Tupaki Desk | 14 March 2017 7:47 AM GMTఎన్నికల ఫలితాలు మార్కెట్ల మీద ప్రభావం చూపడం మామూలే. అధికారంలో ఉన్న పార్టీకి ఏదైనా ఎన్నికల్లో సానుకూల ఫలితాలు వస్తే మార్కెట్లు కూడా జోరందుకుంటాయి. ఐతే తాజాగా ఉత్తర ప్రదేశ్ లో భారతీయ జనతా పార్టీ సాధించిన అద్భుత విజయంతో మార్కెట్ల ఊపు మామూలుగా లేదు. ఈ ఫలితాలతో సెన్సెక్స్.. నిఫ్టీ సూచీలు ఆల్ టైం రికార్డ్ హైకి చేరుకోవడం విశేషం. ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు శుక్రవారమే రాగా.. ఆ తర్వాతి రెండు రోజులూ మార్కెట్లకు సెలవు కావడం.. సోమవారం ఏం జరుగుతుందా అని అంతా ఆసక్తిగా ఎదురు చూశారు. మార్కెట్లలో జోరు ఉంటుందని తెలుసు కానీ.. మరీ ఇంత ఊపును ఊహించలేదు.
కొన్ని గంటల వ్యవధిలోనే మార్కెట్లో మదుపరుల సంపద ఏకంగా 1.31 లక్షల కోట్లు పెరగడం విశేషం. సెన్సెక్స్ 600 పాయింట్లకు పైగా పెరిగి ఓ దశలో 29,560 మార్కును దాటగా.. నిఫ్టీ 188 పాయింట్లు పెరిగి 9120 మార్కును అధిగమించింది. అమెరికన్ డాలర్ తో పోలిస్తే రూపాయి విలువ కూడా పెరిగింది. మార్కెట్ మొదలవడానికి ముందు అమెరికన్ డాలర్ తో పోలిస్తే 66.17గా ఉన్న రూపాయి విలువ.. మార్కెట్ జోరు తర్వాత 66.17కి చేరుకుంది. రూపాయి 43 పైసలు లాభ పడింది. దాదాపుగా అన్ని షేర్ల విలువలూ పెరిగాయి. మదుపరుల సంపద కొన్ని గంటల్లోనే లక్ష కోట్లకు పైగా పెరిగింది. మార్కెట్లు పడ్డపుడు లక్ష కోట్ల సంపద పోయిందంటూ గగ్గోలుపెట్టే సందర్భాలు చాలానే ఉంటాయి కానీ.. ఇలా 1.31 లక్షల కోట్ల సంపద ఒక్కసారిగా పెరగడం అరుదు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/