Begin typing your search above and press return to search.
ఆ రాష్ట్రంలో ఎన్నికల హీట్.. అసదుద్దీన్‌పై రాళ్ల దాడి!
By: Tupaki Desk | 8 Nov 2022 7:30 AM GMTగుజరాత్‌లో అసెంబ్లీ ఎన్నికల వేడి రాజుకుంటోంది. డిసెంబర్ 1న తొలి దశ ఎన్నికలు అక్కడ జరగనున్నాయి. ఈ నేపథ్యంలో అధికార బీజేపీ, ప్రతిపక్ష కాంగ్రెస్ సహా ఈసారి ఆమ్ ఆద్మీ పార్టీ కూడా అధికారం కోసం ఉవ్విళ్లూరుతున్నాయి. వీరి మధ్య తాను సైతం ఉనికి చాటుకోవాలని ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ సిద్ధమవుతున్నారు.
మైనారిటీల ఓటుబ్యాంక్ అధికంగా ఉన్న నియోజకవర్గాల్లో ఎంఐఎం తన అభ్యర్థులను బరిలోకి దించాలని నిర్ణయించింది. సుమారు 25 నుంచి 30 నియోజవర్గాల్లో పోటీ చేయడానికి ఏఐఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఓవైసీ ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ఈ క్రమంలో కొన్ని స్థానిక పార్టీలతో సైతం పొత్తు పెట్టుకునే అవకాశముందని తెలుస్తోంది.
గుజరాత్‌లో చెప్పుకోదగ్గ సంఖ్యలో సీట్లు సాధించి ప్రధాని నరేంద్రమోడీ, కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షాల సొంత రాష్ట్రమైన గుజరాత్‌లో వారికి షాకివ్వాలనే యోచనలో అసదుద్దీన్ ఓవైసీ ఉన్నారు. ఈ నేపథ్యంలో ఎన్నికల ప్రచారంలో చురుగ్గా పాల్గొంటున్నారు.
ఈ క్రమంలో అహ్మదాబాద్ నుంచి సూరత్‌కు వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌లో ప్రయాణించిన అసదుద్దీన్‌కు చేదు ఘటన ఎదురైంది. ఆయన ప్రయాణిస్తున్న బోగీపై గుర్తు తెలియని వ్యక్తులు రాళ్లతో దాడి చేశారు. దీంతో ఆ బోగీ అద్దాలు ధ్వంసమయ్యాయి. రాళ్ల దాడిలో అసదుద్దీన్ ఒవైసీ కూర్చున్న సీటు వైపు అద్దాలు పగిలిపోయాయి.
అహ్మదాబాద్ నుంచి 20–25 కిలోమీటర్లు ప్రయాణంచిన తాము కూర్చున్న కిటికీ వైపు రాళ్లు విసిరారని ఎంఐఎం సీనియర్ నాయకుడు వరిస్ అహ్మద్ ఆరోపించారు. ప్రధాని మోడీ సొంత రాష్ట్రంలోనే ఇలా జరగడం సిగ్గుచేటన్నారు. ఇలాంటి దాడులకు తాము భయపడబోమని తేల్చిచెప్పారు. కాగా ఘటనలో ఎంఐఎం అధినేత అసదుద్దీన్‌కు ఎలాంటి గాయాలు కాలేదు.
కాగా గుజరాత్‌లో మొత్తం 182 అసెంబ్లీ స్థానాలకు రెండు దశల్లో పోలింగ్ నిర్వహించడానికి కేంద్ర ఎన్నికల సంఘం ఇప్పటికే నోటిఫికేషన్ విడుదల చేసింది. డిసెంబర్ 1వ తేదీన 89, 5వ తేదీన మిగిలిన 93 స్థానాలకు ఎన్నిక జరగనుంది. డిసెంబర్ 8 మొత్తం 182 స్థానాలు ఫలితాలు వెల్లడిస్తారు. హిమాచల్‌ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు కూడా అదే రోజు వెలువడనున్నాయి.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.