Begin typing your search above and press return to search.
అమీర్ పై బాలీవుడ్ భగ్గు
By: Tupaki Desk | 24 Nov 2015 2:25 PM GMTపీకే హీరో అమీర్ ఖాన్ పై బాలీవుడ్ రగులుతోంది. మత అసహనం గురించి ప్రస్తావిస్తూ...తను, తన భార్య దేశంలో ఉండాలా లేదా అనే సందేహంలో పడిపోయామని ఖాన్ వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. అయితే అమీర్ ఖాన్ ను ఇంత పెద్ద హీరో చేసిన బాలీవుడ్ ఇపుడు ఆయన వివాదాస్పద వ్యాఖ్యలపై ఎదురుతిరుగుతోంది. సీనియర్ నటుడు అనుపమ్ ఖేర్ ఇప్పటికే తన ఆవేశాన్ని ప్రదర్శించగా మరో బాలీవుడ్ సీనియర్ నటి రవీనా టాండర్ పీకేపై మండిపడ్డారు. ట్వీట్ల వర్షంతో అమీర్ తీరును ఎండగట్టారు.
బాలీవుడ్ నటి రవీనా టాండన్ పలు ట్వీట్లలో తన మనోభావాలను వెల్లడించారు. నరేంద్ర మోడీ ప్రధాని పగ్గాలు చేపట్టిన రోజు నుంచి సంతోషంగా లేని వర్గాలు అసహనం పేరుతో మనసులోని భావాలను పరోక్షంగా చెప్తున్నాయని మండిపడ్డారు. అయితే ముసుగులో గుద్దులాట బదులు బహిరంగంగా చెబితే సరిపోతుంది కదా అంటూ ఎద్దేవా చేశారు. నరేంద్ర మోడీని ప్రధానిగా చూడటం ఇష్టంలేకనే ప్రభుత్వాన్ని దించేయాలనుకుంటున్నారని రవీనాటాండన్ విమర్శించారు.
"దేశానికి గుండెకాయ లాంటి ముంబై మహానగరం మీద బాంబుల వర్షం కురిసినప్పుడు వాళ్లకు ఎందుకు భయం వేయలేదో అని ఆశ్చర్యం వేస్తోంది. మోడీని ప్రధానిగా చూడకూడదని అనుకునేవాళ్లంతా ప్రభుత్వాన్ని కూల్చేయాలనుకుంటున్నారు. వాళ్లు దేశానికి సిగ్గుచేటు. అసహనాన్ని ఖండించాలని, దానిపై చర్యలు తీసుకోవాలని ప్రతి ఒక్కరూ చెప్పొచ్చు. కానీ ఇలా విషం చిమ్మడం సరికాదు" అని ట్వీట్ లలో టాండన్ మండిపడ్డారు.
"దేశం నీకు ఏమిచ్చిందో, నువ్వు దేశానికి ఏమిచ్చావో ముందు నిన్ను నువ్వు ప్రశ్నించుకో. ప్రధాని హోదాలో మోడీ ఉండటం ఇష్టం లేకపోతే...నేరుగా చెప్పాలే తప్ప దేశంలో ఉంటూనే దేశం సిగ్గుపడేలా వ్యాఖ్యానించడం సరికాదు" అని రవీనాటాండన్ మండిపడ్డారు. "దమ్ముంటే మోడీని ప్రధానిగా చూడటం ఇష్టంలేదని విషయాన్ని బహిరంగంగా చెప్పాలి" అని ఘాటు వ్యాఖ్యలు చేశారు.
బీజేపీ అధికార ప్రతినిధి షానవాజ్ హుస్సేణ్ సైతం అమీర్ తీరుపై మండిపడ్డారు. అయితే దేశ ప్రతిష్ఠను మంటగలపడానికి అమీర్ ఖాన్ ప్రయత్నిస్తున్నారని షానవాజ్ ధ్వజమెత్తారు. భారత్ కన్నా మరో మెరుగైన దేశాన్ని అమీర్ ఖాన్ చూడలేరని స్పష్టం చేశారు.