Begin typing your search above and press return to search.

బ్రేకింగ్: ఫ్లూటో పై గాలులు.. జీవం ఉందా?

By:  Tupaki Desk   |   8 Feb 2020 11:21 AM GMT
బ్రేకింగ్: ఫ్లూటో పై గాలులు.. జీవం ఉందా?
X
భూమితోపాటు నవగ్రహాలకు నెలవైన సౌర మండలంలో మరో అద్భుతాన్ని నాసా శాస్త్రవేత్తలు కనుగొన్నారు. సూర్యుడి నుంచి చివరిదైన మరుగుజ్జు అతిచిన్న గ్రహం ఫ్లూటో.. ఈ గ్రహంపై వాయువు ప్రసరణ నమూనాలను నాసా న్యూహారిజన్స్ అంతరిక్ష నౌక కనుగొంది. గుండె ఆకారంలో ఉన్న ప్రాంతంలో గాలులు ఉన్నట్టు గుర్తించింది.

అంతేకాదు.. ఈ ఫ్లూటో గ్రహంలో నత్రజని ఉందని.. ఆ వాయువును పంపింగ్ చేస్తోందని అమెరికా నాసా శాస్త్రవేత్తలు కనిపెట్టారు. ఫ్టూటో గ్రహంలోని గుండె ఆకారంలోని ఎడమ సైడ్ లో 600 మైళ్ల వెడల్పులో నత్రజని మంచు వాయువు రూపంలో ఉందని.. దీన్ని స్పుత్నిక్ ప్లానిటియాగా పిలుస్తారని పేర్కొంది.

సూర్యుడు ప్రసరించే పగటిపూట ఆ మంచు ఆవిరి అవుతోందని..రాత్రి సమయంలో మళ్లీ మంచుగడ్డలా తయారవుతోందని నాసా శాస్త్రవేత్తలు కనిపెట్టారు. ఆ గ్రహంపై నత్రజని గాలులు కూడా వీస్తుంటాయని సంచలన విషయాన్ని బయటపెట్టారు.

మన భూమిపై ఆక్సిజన్ మానవాళి మనుగడకు ప్రాణం పోస్తే ఫ్లూటోపై నత్రజని వాయువు అధికంగా ఉందని శాస్త్రవేత్తలు తెలిపారు. మనం భూమిపై పీల్చే గాలి కంటే లక్ష రెట్లు సన్నాగా ఫ్లూటోపై నత్రజని ఉందని సంచలన విషయాన్ని శాస్త్రవేత్తలు కనిపెట్టారు. ఫ్లూటో గ్రహంపై నత్రజని గాలులు వేడి, కణాలు, మంచి బిందువులుగా మారుతూ పడమర వైపునకు తీసుకెళ్లాయని గుర్తించారు. నత్రజని గాలి ఉండడంతో ఇక్కడ జీవుల మనుగడ ఉందా అనే దానిపై నాసా శాస్త్రవేత్తలు పరిశోదన మొదలు పెట్టారు.