Begin typing your search above and press return to search.
చంద్రబాబును కాపాడుతున్న తుఫాన్లు
By: Tupaki Desk | 27 April 2019 4:23 AM GMTతుపాన్లు చంద్రబాబుకు కలిసొచ్చినట్లుగా ఇంకెవరికీ కలిసిరావేవో. 2014లో చంద్రబాబు సీఎం అయిన తరువాత.. కొత్త రాష్ట్రం, కొత్తగా రాజధాని కట్టుకోవాల్సిన తరుణం.. అలాంటి వేళ విశాఖపట్నంపై హుదుహుద్ తుపాను దాడి చేసింది. చంద్రబాబు రేయింబవళ్లు అక్కడే ఉండి పరిస్థితులు చక్కదిద్ది మంచి పేరు కొట్టేశారు.
మొన్నటికి మొన్న జగన్ పాదయాత్ర శ్రీకాకుళం జిల్లాలో ప్రవేశించడానికి కొద్ది రోజుల ముందు తిత్లీ తుపాను శ్రీకాకుళం జిల్లాను అతలాకుతలం చేసింది. మళ్లీ చంద్రబాబు అక్కడే క్యాంప్ వేసి.. పలాస నుంచే పాలన సాగించి ఆ ప్రాంత ప్రజలను ఆకట్టకున్నారు.
ఇప్పుడు ఏపీలో ఎన్నికల పోలింగ్ ముగిసిన తరువాత కేంద్రం సపోర్టుతో ఎన్నికల సంఘం చంద్రబాబుకు అడుగడుగునా అడ్డు తగులుతూ ముప్పతిప్పలు పెడుతున్న వేళ మరో తుపాను అతన్ని ఆదుకోవడానికి వచ్చింది.
ప్రస్తుతం ఎన్నికల కోడ్ అమల్లో ఉండడంతో ఇంటెరిమ్ సీఎంగా చంద్రబాబు ఎలాంటి పాలసీ డెసిషన్లు తీసుకోవడానికి, సమీక్షలు జరపడానికి వీల్లేదంటూ ఈసీ సీఎస్ ద్వారా అంతా చక్కబెతుడుతున్న వేళ చంద్రబాబు అఫీషియల్ గా అధికారులతో సమీక్షలు జరపడానికి ఫణి తుపాను అవకాశమిచ్చింది.
తమిళనాడు తీరానికి సమీపంలో కేంద్రీకృతమైన ఫణి తుపాను ఏపీ దక్షిణ తీరంపైనా ప్రభావం చూపొచ్చని వాతావరణ కేంద్రం హెచ్చరికలు జారీ చేసింది. దీంతో చంద్రబాబు తుపాను నేపథ్యంలో సన్నద్ధతపై సమీక్ష జరపాడానికి అవకాశమేర్పడింది. ఎన్నికల కోడ్ ఉన్నా కూడా ప్రకృతి విపత్తులు సమయంలో ఇంటెరిమ్ సీఎం సమీక్షలు చేయొచ్చు. అదీ చంద్రబాబుకు కలిసొచ్చిన అంశం.
మరోవైపు చంద్రబాబును కాదని సీఎస్ ఎల్వీ సుబ్రహ్మణ్యం సమీక్షలు జరుపుతుండడంతో ఇప్పటికే మండిపడుతున్న టీడీపీ నేతలకూ ఇది వరంగా మారింది. తుపాను వచ్చి పడుతుంటే సీఎస్ ఏం చేస్తున్నారంటూ వారు నిలదీస్తున్నారు.