Begin typing your search above and press return to search.

ట్రంప్ అక్ర‌మ‌సంబంధం..ఆయ‌న మాట‌ల‌తో కొత్త ట్విస్ట్‌

By:  Tupaki Desk   |   3 May 2018 4:30 PM GMT
ట్రంప్ అక్ర‌మ‌సంబంధం..ఆయ‌న మాట‌ల‌తో కొత్త ట్విస్ట్‌
X
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంసారంలో చిచ్చు రేగింది. డొనాల్డ్‌ ట్రంప్‌ తో త‌న‌కు అక్ర‌మ‌సంబంధం ఉంద‌ని స్టోర్మీ డేనియల్స్ ఫోర్న్ స్టార్ ఆరోపించిన సంగ‌తి తెలిసిందే. అంతేకాకుండా ఆమె న్యాయ పోరాటానికి సిద్ధమైంది. కాలిఫోర్నియాలోని కోర్టులో ట్రంప్‌ పై ఆమె దావా వేసింది. ట్రంప్‌తో తనకు అక్రమ సంబంధముందని ఆరోపించింది. ఈ విషయాన్ని బయటపెట్టకుండా ఉండేందుకు అధ్యక్ష ఎన్నికల ముందు ట్రంప్‌ న్యాయవాది తనను బెదిరించాడని పేర్కొంది. అయితే ఈ విష‌యం మ‌లుపులు తిరిగింది. ఫోర్న్ స్టార్ స్టార్మీ డేనియల్స్‌తో శారీరక సంబంధం కొనసాగించినందుకు గాను ట్రంప్ ఆమెకు డబ్బులను చెల్లించినట్టు న్యూయార్క్ మాజీ మేయర్ రుడీ గిలియానీ సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేశారు.

ట్రంప్‌తో త‌న‌కు అక్రమ సంబంధం ఉంద‌ని ఆరోపించిన స్టోర్మీ విషయం బయటకు పొక్కకుండా ఉంచేలా తనతో బలవంతంగా సంతకం చేయించాడని ఆరోపించింది. 2016లో తాను ఓ ఒప్పంద పత్రంపై బలవంతంగా సంతకం చేశానని పేర్కొన్నది. అయితే, స్టోర్మీ చేసిన ఆరోపణలను ట్రంప్‌ ఖండించారు. మీడియాకు స్టోర్మీ వెల్లడించిన వివరాల ప్రకారం.. ట్రంప్‌ తో అఫైర్‌ ను బయటపెట్టకుండా ఉండేందుకు ఆయన న్యాయవాది మైకేల్‌ కోహెన్‌ తనకు 1,30,000డాలర్లు చెల్లించారని ఆమె దావాలో పేర్కొంది. అయితే తాజాగా న్యూయార్క్ మాజీ మేయర్ రుడి గిలియానీ ఓ మీడియా సంస్థతో మాట్లాడుతూ సంచ‌ల‌న విష‌యాలు వెల్ల‌డించారు. 2016 నవంబర్ మాసంలో ఫోర్న్ స్టార్ స్టార్మీ డేనియల్స్‌తో ట్రంప్ ఒప్పందాన్ని కుదుర్చుకొన్నాడని ఆయ‌న ప్ర‌క‌టించారు. ట్రంప్ వద్ద సుదీర్ఘ కాలంగా పనిచేస్తున్న లాయర్ మైఖేల్ కోహెన్ వద్ద నుండి ఫోర్న్‌స్టార్ డేనియల్ తాను చేసుకొన్న ఒప్పందం మేరకు నగదును తీసుకొందని ఆయన చెప్పారు. ఆ తర్వాత కొన్ని రోజులకు ఫోర్న్‌స్టార్‌ కు చెల్లించిన నగదుకు సమానమైన మొత్తాన్ని ట్రంప్ మైఖేల్ కోహెన్‌ కు చెల్లించారని ప్ర‌క‌టించి క‌ల‌క‌లం రేకెత్తించారు. ఈ మొత్తాన్ని ట్రంప్ కోసం ప్ర‌చారం చేసినందుకు ఇచ్చిన‌ట్లుగా కొంద‌రు భావిస్తున్నార‌ని..అయితే అధ్య‌క్ష ఎన్నిక‌ల్లో ఆమె ప్రచారం చేయ‌లేద‌ని అన్నారు. అయితే త‌న లాయ‌ర్ ద్వారా ఈ కేసును సెటిల్ చేసుకున్న ట్రంప్ ఇందుకోసం ఇచ్చిన డ‌బ్బులు ఎక్క‌డివో త‌న‌కు తెలియ‌ద‌ని న్యూయార్క్ మాజీ మేయ‌ర్ తెలిపారు.

ఇదిలాఉండ‌గా...ఇటీవల ట్రంప్ అక్రమసంబంధానికి సంబంధించి కొన్ని వార్తలు అగ్రరాజ్యంలో హల్‌ చల్ చేశాయి. ట్రంప్ అక్ర‌మ సంబంధం నేప‌థ్యంలో ఆయ‌న భార్య మెలానియా ట్రంప్‌ ను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారని ప్ర‌చారం జ‌రిగింది. అంతేకాదు ఈ వార్త తెర‌మీద‌కు వ‌చ్చిన త‌ర్వాత జరిగిన ఓ సదస్సుకు కూడా ఆమె వెళ్లలేదని, ట్రంప్‌ తో కలిసి వైట్‌ హౌస్‌ లో ఉండే నెలానియా ఓ హోటల్‌ కి షిఫ్ట్ అయ్యారని క‌థ‌నాలు వ‌చ్చాయి.. దీనంతటికి ట్రంప్ అక్రమ సంబంధమే కారణమని నెటిజన్లు అనుకుంటున్నారని మీడియా పేర్కొంది.