Begin typing your search above and press return to search.
స్మృతి ఇరానీ తెలుగు ట్వీట్ వెనుక అంత కథ ఉందా?
By: Tupaki Desk | 15 Aug 2019 8:18 PM GMTతెలుగు రాష్ట్రాల ప్రజలను తమ వైపు తిప్పుకొనేందుకు బీజేపీ అన్ని ప్రయత్నాలూ చేస్తోంది. బీజేపీ నాయకుల్లో ఎవరికి అవకాశం చిక్కినా ఏపీ ప్రజలను ఆకట్టుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. ప్రధాని మోదీ మొదలుకుని పలువురు కేంద్ర మంత్రులు సందర్భం వచ్చిన ప్రతిసారీ ఏపీ ప్రజలకు దగ్గరవ్వాలని ట్రై చేస్తున్నారు. తాజాగా రాహుల్ గాంధీని అమేఠీలో ఓడించి జెయింట్ కిల్లర్ అనిపించుకున్న కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ కూడా తెలుగు ప్రజలను ఆకట్టుకునే ప్రయత్నం చేశారు.
కేంద్ర చేనేత, జౌళి శాఖ మంత్రిగా ఉన్న స్మృతి ఇరానీ ఇటీవలే- `సమర్థ్` పథకాన్ని ఆరంభించారు. ఏపీ, తెలంగాణలతో పాటు దేశవ్యాప్తంగా 16 రాష్ట్రాలు ఈ పథకంలో చేరాయి. దీనికి సంబంధించిన సమాచారాన్ని తెలియజేస్తూ.. తెలుగులో ఓ ట్వీట్ చేశారు స్మృతి ఇరానీ. సమర్థ్ పథకంతో సమర్థవంతంగా.. రెండు తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన పర్యాటక, ఆధ్యాత్మిక ప్రదేశాలు, దేవాలయాలపై చిత్రీకరించిన ఓ వీడియోను ఈ ట్వీట్ కు జోడించారు. సమర్థ్ పథకం కింద రాష్ట్ర ప్రభుత్వం కూడా తన వంత భాగస్వామ్యాన్ని అందించాల్సి ఉంటుంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా అమలు చేస్తున్న ‘సమర్ధ్' పథకం కింద ఏపీలో 12 వేల మంది యువతకు దుస్తుల తయారీలో నైపుణ్యాలను పెంపొందించుకొనేందుకు శిక్షణ ఇస్తామని వెల్లడించారు. బీజేపీ సహకారంతో ఏపీ, తెలంగాణ ప్రభుత్వాలు 12 వేల మంది యువతను ఎంపిక చేయాల్సి ఉంటుందనేది ట్విస్ట్. ఈ సమర్థ్ పథకాన్ని వినియోగించుకుని, పెద్ద ఎత్తున యువతకు గాలం వేయాలని బీజేపీ అధిష్ఠానం నుంచి రాష్ట్రశాఖ నాయకులకు సమాాచారం అందిందని చెబుతున్నారు.
సెంటిమెంట్లను రగల్చడంతో సిద్ధహస్తులైన బీజేపీ నాయకులు ఇలా అందివచ్చిన ప్రతి అవకాశాన్నీ వినియోగించుకుంటున్నారు. కేవలం ఒకట్రెండు తెలుగు ట్వీట్లు చేసినంత మాత్రాన ప్రజలు బీజేపీ వలలో ఏం పడిపోరని తెలుగు రాష్ట్రాల్లోని రాజకీయ పార్టీలు సర్దిచెప్పుకొంటున్నా బీజేపీ ఎదిగిన క్రమం చూస్తే ఆ పార్టీ చిన్నచిన్న ఆయుధాలతోనే పెద్దపెద్ద లక్ష్యాలను పడగొడుతుందని అర్థమవుతుంది.
ఇప్పుడు తెలుగు రాష్ట్రాలపై కన్నేసిన బీజేపీ ఒక్కో దశలో ఒక్కొక్కరిని రంగంలో దించుతూ ఇక్కడి యువతను, గ్రామీణ ప్రజలను ఆకట్టుకునేందుకు పక్కా ప్రణాళిలను ఇప్పటికే సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. ముందుముందు బీజేపీ నాయకులు ఒక్కొరొక్కరు ఏపీ, తెలంగాణలపై పోకస్ చేయడం.. ఇక్కడ పర్యటించడం చూస్తామని ఆ పార్టీ వర్గాలే చెబుతున్నాయి.