Begin typing your search above and press return to search.
ఆపరేషన్ కశ్మీర్ వెనుక ఇంత జరిగిందా?
By: Tupaki Desk | 10 Aug 2019 2:30 PM GMTజమ్ముకశ్మీర్ కు స్వయంప్రతిపత్తిని కల్పించే అధికరణం 370ని అనూహ్యంగా కేంద్రం రద్దు చేసిన సంగతి తెలిసిందే. ఆర్టికల్ 370, దానిలో అవిభాజ్యంగా ఉన్న ఆర్టికల్ 35-ఏ కాలగర్భంలో కలిసిపోయాయి. అమిత్ షా ప్రవేశపెట్టిన బిల్లులపై రాజ్యసభలో చర్చ జరిగింది. అనంతరం ఈ బిల్లులను రాజ్యసభ ఆమోదించింది. ఆర్టికల్ 370 రద్దు, రిజర్వేషన్ల బిల్లులను మూజువాణీ ఓటుతో ఆమోదించగా.. జమ్ముకశ్మీర్ పునర్ వ్యవస్థీకరణ బిల్లు-2019పై ఓటింగ్ నిర్వహించారు. చర్చ సందర్భంగా తృణమూల్ కాంగ్రెస్ వాకౌట్ చేసింది. బిల్లుకు అనుకూలంగా 125 ఓట్లు రాగా, వ్యతిరేకంగా 61 ఓట్లు వచ్చాయి. దీంతో బిల్లు ఆమోదం పొందినట్టు చైర్మన్ వెంకయ్యనాయుడు ప్రకటించారు.
ఆర్టికల్స్ 370, 35-ఏలను రద్దు అంతా రాజ్యసభలో క్షణాల వ్యవధిలోనే పూర్తయిన సంగతి తెలిసిందే. గత సోమవారం పరిణామాలు వేగంగా మారిపోయాయి. ఆర్టికల్ 370 రద్దు, రాష్ట్ర విభజనపై మొదటి నుంచీ గోప్యత పాటించిన కేంద్ర ప్రభుత్వం.. బిల్లులను రాజ్యసభలో ప్రవేశపెట్టేవరకు ఎవరికీ తెలియకుండా జాగ్రత్తలు తీసుకుంది. ముందుగా సోమవారం ఉదయం ప్రధానమంత్రి నరేంద్రమోదీ నివాసంలో కేంద్ర క్యాబినెట్ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఆర్టికల్ 370 రద్దుకు నిర్ణయం తీసుకున్నారు. అనంతరం ప్రధానమంత్రి నరేంద్రమోదీ, ఇతర మంత్రులు పార్లమెంట్ కు బయలుదేరి వెళ్లారు. కేంద్ర హోంమంత్రి అమిత్‌షా రాజ్యసభకు చేరుకున్నారు. ఆయన సభలో ఇతర బిల్లులతోపాటు ఆర్టికల్ 370 రద్దు తీర్మానాన్ని ప్రవేశపెట్టి అందరినీ షాక్ కు గురిచేశారు. అంతకుముందే ఆర్టికల్ 370 రద్దుకు రాష్ట్రపతి ఆమోదముద్ర వేశారు. ఈ నిర్ణయం సోమవారం నుంచే అమల్లోకి వస్తుందంటూ గెజిట్ జారీ చేశారు. ఈ మేరకు విడుదల చేసిన గెజిట్ పత్రాలను అమిత్ షా సభ్యులందరికీ అందించారు. దీంతో జమ్ముకశ్మీర్ స్వయంప్రతిపత్తిని కోల్పోయింది. ఈ బిల్లులను ప్రతిపక్షాలు తీవ్రంగా వ్యతిరేకించినా.. నిరసనలు తెలిపినా ఫలితం లేకపోయింది. అనంతరం రాష్ట్ర పునర్‌వ్యవస్థీకరణ బిల్లుకు ఆమోదముద్ర పడింది. దీంతో జమ్ముకశ్మీర్ రెండు కేంద్రపాలిత ప్రాంతాలుగా విడిపోయింది.
కాగా, రాజ్యసభలో టీఆర్ ఎస్ తో పాటు వైసీపీ- బీఎస్పీ- బీజేడీ- అన్నాడీఎంకే- ఆమ్‌ఆద్మీ తదితర పార్టీలు ఈ బిల్లులకు మద్దతు తెలిపాయి. ఎన్డీయే భాగస్వామి జేడీయూ బిల్లులను వ్యతిరేకిస్తూ వాకౌట్ చేసింది. కాంగ్రెస్- తృణమూల్- పీడీపీ- ఎన్సీ- వామపక్షాలు రెండు బిల్లులను తీవ్రంగా వ్యతిరేకించాయి. అయినప్పటికీ రాజ్యసభలో బిల్లు ఆమోదం పొందింది. అయితే, ఈ పరిణామాల వెనుక బీజేపీ పెద్దల వ్యూహాత్మక ఎత్తుగడలు ఉన్నాయని తెలుస్తోంది.
పక్కా ప్రణాళిక, అత్యంత గోప్యతతో ఆపరేషన్ కాశ్మీర్ ను పూర్తి చేశారు. తమకు మెజారిటీ తక్కువగా ఉన్నా.. ఆర్టీఐ సవరణ, తక్షణ తలాక్ బిల్లులను ఎన్డీయే ప్రభుత్వం రాజ్యసభలో ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. అప్పట్లో కొన్ని పార్టీలు మద్దతిచ్చాయి. కొన్ని వాకౌట్ చేశాయి. దాంతో, మరింత పకడ్బందీగా వ్యవహరించింది. అయినప్పటికీ కేంద్రం వాటిని ఆమోదించుకుంది. ఈ నేపథ్యంలో ఆ ఎపిసోడ్ ను ఆపరేషన్ కాశ్మీర్ కు రిహార్సల్ గా చేసుకుంది. తెలంగాణ- ఏపీ- ఒడిసా సీఎంలు కేసీఆర్- జగన్- నవీన్ పట్నాయక్ కు ఫోన్ చేసి మరీ మద్దతు కోరింది. బీఎస్పీ ఎంపీ సతీశ్ చంద్ర మిశ్రా ద్వారా మాయావతితో సంప్రదింపులు జరిపింది.
ఆపరేషన్ కాశ్మీర్ ప్రణాళిక కేంద్ర హోం మంత్రి అమిత్ షాది కాగా.. పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి, కేంద్ర మంత్రులు పీయూష్ గోయల్, ధర్మేంద్ర ప్రధాన్ కీలక పాత్ర పోషించారు. పకడ్బందీ వ్యూహంతోనే తొలుత బిల్లును రాజ్యసభలో ప్రవేశపెట్టింది. సభా నాయకులతో మాట్లాడి, బిల్లుకు అనుకూలంగా మద్దతు కూడగట్టడంలో ఈ ముగ్గురు క్రియాశీలంగా వ్యవహరించారు.