Begin typing your search above and press return to search.
కరోనా జయించిన తెలుగు యువకుడి కథ
By: Tupaki Desk | 25 March 2020 9:30 AM GMTఇన్నాళ్లు అంతగా ప్రభావం లేని కరోనా ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో తీవ్రరూపం దాలుస్తోంది. దాదాపు 10 దాకా పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. అయితే మొట్టమొదట నెల్లూరు లో కరోనా పాజిటివ్ కేసు నమోదవ్వగా ఆ యువకుడు విజయవంతంగా కరోనా నుంచి బయటపడ్డాడు. ఈ సందర్భంగా ఓ మీడియా సంస్థతో ఫోన్‌లో మాట్లాడాడు. కరోనా ఎలా సోకింది? కరోనా వస్తే ఎలా ఉంటుంది? చికిత్స ఎలా? వంటి వివరాలు ఆ మీడియా సంస్థ తో పంచుకున్నాడు. ఈ సందర్భంగా కరోనా జయించిన ఆ యువకుడి మాటల్లోనే
ఉన్నత చదువుల కోసం ఇటలీకి వెళ్లగా అక్కడ కరోనా తీవ్రంగా వ్యాప్తి చెందుతుండడంతో అక్కడ ప్రభుత్వ ఆంక్షలు పెరిగిపోయాయి. లాక్ డౌన్ ప్రకటించడంతో మా కళాశాల మూసేశారు.. ఈ సమయంలో మా కుటుంబసభ్యులు కంగారు పడుతుండడం తో ఎట్టకేలకు భారత్ పయనమయ్యా.
ఇటీల నుంచి ఢిల్లీలో దిగి అనంతరం చెన్నైలో దిగాను. ఢిల్లీ - చెన్నై విమానాశ్రయాల్లో థర్మల్ స్క్రీనింగ్ టెస్ట్ చేయగా నార్మల్ వచ్చింది. దీంతో ఇంటికొచ్చేశా. అప్పటి నుంచి వైద్యాధికారులు అతడితో సంప్రదింపులు చేస్తున్నారు. అతడి ఆరోగ్యం గురించి నిరంతరం పర్యవేక్షించారు. ఇంటికొచ్చాక మూడు రోజుల తర్వాత దగ్గు రావడం తో ప్రభుత్వ ఆస్పత్రిలో చేరాడు. వైద్యులు పరిశీలించి వెంటనే సొలేషన్ వార్డులో చేర్చారు. శాంపిల్స్ తీసి పరీక్షకు పంపగా పాజిటివ్ అని వచ్చింది. అయితే తనకు పాజిటివ్ ఉందని చెప్పడంతో అతడు నమ్మలేదని చెప్పాడు. తనకు ఏమీ లేని పరిస్థితిలో నెగెటివ్ ఉంటుందని భావించగా పాజిటివ్ అని వైద్యులు చెబుతూ రిపోర్టులు చూపించారంట.
అయితే కరోనా సోకిందని నిర్ధారణ అయిన తర్వాత తానేమి భయపడలేదని - వైద్యులు తనకు కొండంత ధైర్యం ఇచ్చారని చెప్పాడు. చికిత్సతోపాటు వైరస్ కు సంబంధించిన ఏ సందేహం వచ్చినా వారు నివృత్తి చేశారంట. దీంతో కరోనా వైరస్‌పై అవగాహన వచ్చిందని తెలిపారు.
అయితే కరోనా సోకడంతో వైద్యులు తనకు ముఖ్యంగా ధైర్యంగా ఉండి మానసికంగా బలంగా ఉండడం ముఖ్యమని స్పష్టం చేశారంట. దీంతోపాటు వ్యాధి నిరోధక శక్తిని పెంచుకుంటే కరోనాను ఎదుర్కోవచ్చు అని చెప్పారు. ఈ సందర్భంగా ఐసోలేషన్ వార్డులో తనకు మంచి ఆహారం, అవసరమైన మందులు క్రమం తప్పకుండా ఇచ్చారని, మంచి బలవర్ధక ఆహారాన్ని అందించారని వివరించారు. ఐసొలేషన్ లో ఉన్న తనతోపాటు మరికొందరి కోసం ప్రత్యేకంగా వంటలు చేయించారని పేర్కొన్నారు.
ఐసొలేషన్ వార్డులో మొత్తం 14 రోజులు ఉన్నానని, అయితే మొదటి రెండు రోజులు బోర్‌గా ఫీలయ్యానని తెలిపారు. ఆ తరువాత అతడికి అలవాటైపోయిందంట. ఈ కేంద్రంలో ఉన్నా తన తల్లిదండ్రులతో రోజుకు నాలుగైదుసార్లు ఫోన్‌లో మాట్లాడినట్లు చెప్పారు. ల్యాప్‌టాప్‌లో సినిమాలు చూశానని, వార్త చానెల్స్ చూస్తూ కరోనా గురించి తెలుసుకున్నట్లు వివరించాడు.
అయితే ఐసొలేషన్ లో ఉన్న 14 రోజులు ప్రశాంతంగా గడిపానని తెలిపారు. అయితే తన అనుమతి లేకుండా ఆస్పత్రికి వచ్చి కొందరు మీడియా వారు ఫొటోలు, వీడియోలు తీసి ప్రసారం చేయడంతో తనకు ఇబ్బంది కలిగిందని వాపోయాడు. అయితే తన ఫొటో తో కొందరు సోషల్ మీడియాలో దుష్ప్రచారం చేశారని, అది బాధించిందని తెలిపారు. తాను ఆస్పత్రి నుంచి పారిపోయానని తదితర పుకార్లు చేశారని, వాటితో తాను కుమిలిపోయినట్లు తెలిపారు.
ఈ సందర్భంగా ఆయన ప్రజలకు కరోనా వైరస్‌పై భయపడవద్దని, కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే ధైర్యంగా ఎదుర్కోవచ్చని, సక్రమంగా ఆహారం తీసుకుని శుచిశుభ్రత పాటిస్తే ఏ వైరస్ సోకదని స్పష్టం చేశారు. ప్రస్తుతం లాక్ డౌన్ ఉండడంతో ప్రజలు సహకరించి వైరస్ నివారణకు సహకరించాలని ఫోన్ లో అందరినీ కోరారు.