Begin typing your search above and press return to search.
ఇంతకీ క్రిస్మస్ తాత ఎవరు? నిజంగా ఉన్నాడా? ఆయన కథేంటి?
By: Tupaki Desk | 24 Dec 2020 5:30 PM GMTక్రిస్మస్ పండగ క్రైస్తవులకు చాలా పెద్దపండగ. ఈ పండగనాడు విశ్వవ్యాప్తంగా వేడుకలు జరుగుతూ ఉంటాయి. అయితే క్రిస్మస్ పండగరోజు ప్రధాన ఆకర్షణగా నిలిచేది క్రిస్మస్ తాతయ్య (శాంతాక్లాజ్). శాంతాక్లాజ్ పిల్లలకు బహమతులు ఇస్తుంటాడు. చాక్లెట్స్, కేక్స్, ఐస్‌క్రీమ్ పంచుతుంటాడు.
అయితే ఈ క్రిస్మస్ తాతా ఎవరు? ఆయన ఒకప్పుడు నిజంగానే ఉన్నాడా? అన్న ఆసక్తి సహజంగానే అందరిలో ఉంటుంది. ఆ క్రిస్మస్ తాతయ్య ఎవరూ ఎక్కడుంటాడో ఇప్పుడు తెలుసుకొనే ప్రయత్నం చేద్దాం. క్రిస్మస్ తాతయ్య అని ఎవరూ ఉండరని.. అదో ఊహాజనిత పాత్ర అని కొట్టిపారేసే వారు ఉన్నారు. అయితే శాంతాక్లాజ్ ఒకప్పుడు నిజంగానే ఉండాన్నడని చరిత్రకారులు అంటున్నారు. ఇటీవలే శాంతాక్లాజ్‌కు చెందిన సమాధిని కూడా టర్కీలో గుర్తించారు. పురావస్తు శాఖ అధికారులు దక్షిణ టర్కీ అంటాల్యా ప్రొవిన్స్‌లోని డేమేరే జిల్లాలో ఉన్న చర్చి కింద శాంతాక్లాజ్ సమాధిని వారు గుర్తించారు.
అయితే శాంతా క్లాజ్ అక్కడే పుట్టారని చరిత్రకారులు అంటున్నారు. అందుకు సాక్ష్యం అదే చర్చిలో దొరికిన కొన్ని గ్రంథాలు. క్రీస్తుశకం 343లో శాంతాక్లాజ్ మరణించినట్టు చరిత్రకారులు అంటున్నారు. అయితే ఆయన పుట్టుక, జీవిత విశేషాలకు సంబంధించి మరింత పరిశోధన సాగాల్సిఉంది. ప్రస్తుతం గ్రంథాల్లో ఉన్న వివరాల ప్రకారం.. శాంతక్లాజ్ తన జీవితాన్ని చిన్నపిల్లల కోసం ధారబోసాడట. తన ఆస్తులను అమ్మి మరీ చిన్నపిల్లలకు బహుమతులు పంచేవాడట.
తన ఆదాయాన్ని కూడా చిన్నపిల్లల కోసమే వెచ్చించేవాడట.
అయితే మొదట్లో శాంతాక్లాజ్ వేడుకలు డిసెంబర్ 6 జరిగేవి. ఆ తర్వాత అవి డిసెంబర్ 24కు మారాయి. అలా ఎందుకు మారాయో తెలియదు. మరోవైపు శాంతాక్లాజ్ ఆకాశంలో పయనిస్తూ ఉంటారని అతడికి చిన్న పిల్లలంటే ఎంతో ప్రేమ అని క్రైస్తవులు నమ్ముతారు. శాంతాక్లాజ్ వివిధ రూపాల్లో వచ్చి పిల్లలకు బహుమతులు పంచుతాడని క్రైస్తవుల విశ్వాసం.