Begin typing your search above and press return to search.
పెళ్లికార్డుతోనే పిచ్చెక్కించారు..! ఇక పెళ్లి ఏ రేంజ్లో ఉంటుందో?
By: Tupaki Desk | 19 Dec 2020 1:30 PM GMTపెళ్లిల్లు ఎంత క్రియేటివిటీతో చేసుకుంటే అంత గొప్ప. అప్పుడే మన పెళ్లిళ్లపై అందరూ మాట్లాడుకుంటారు. సాధారణంగా చేసుకుంటే విశేషం ఏముంది. ఎంత ఖర్చుపెట్టుకొని పెళ్లి వేడుక చేసుకున్నాం.. అన్నది కాదు.. ఎంత క్రియేటివిటీతో చేసుకున్నమన్నదే ముఖ్యం. ప్రస్తుతం అలా తయరైంది సమాజం. ఓ పెళ్లివేడుకలో పెళ్లికూతురు డ్యాన్స్ చేస్తూ వేడుకమీదకు వస్తుంది.. మరో కోటిశ్వరుడేమో లారీల కొద్ది తన కూతురుకు కానుకలు పంపించి కొత్త ట్రెండ్ సృష్టించాడు. ఓ అత్త ఏమో కోడలు పెళ్లి చేసుకుని మెట్టింటికి వచ్చిన సందర్భంగా 200 రకాల వంటలు చేసింది. ఇటువంటి పెళ్లి వేడుకలు ఈ లాక్డౌన్లో కామన్ అయిపోయాయి.
మరోవైపు ఆన్లైన్ పెళ్లిళ్లు కూడా జోరుగా జరుగుతున్నాయి. ఎక్కడో అమెరికాలోనూ, బ్రిటన్‌లోనూ పెళ్లి కూతురు, పెళ్లి కొడుకు రింగ్‌లు మార్చుకుంటారు. ఈ దృశ్యాలను ఇక్కడ పెద్ద పెద్ద స్క్రీన్లలో వీక్షిస్తూ ఇరు కుటుంబాలు, బంధువలు వేడుక చేసుకుంటారు. ఇటువంటి వేడుకలు కూడా ఇటీవల ఎక్కువయ్యాయి. ఇప్పుడు మహారాష్ట్రకు చెందిన ఓ కుటుంబం కూడా ఇటువంటి ప్రయోగమే చేయాలనుకున్నది. తాము పెళ్లికార్డు ఇచ్చేటప్పుడే కాస్త వెరైటీగా ప్లాన్ చేశారు.
అందుకే పెళ్లికార్డుతో పాటు ఓ ఫుల్ బాటిల్.. స్టఫ్ కోసం స్నాక్స్ అందజేసి క్రియేటివిటీ చాటుకున్నారు.ఇప్పుడు ఈ వ్యవహారం సోషల్‌మీడియాలో వైరల్‌గా మారింది. మా బంధువులు కూడా ఇలా పెళ్లి కార్డుతో పాటు ఓ ఫుల్‌బాటిల్ తెచ్చిస్తే బాగుంటుందంటూ కొందరు నెటిజన్లు ఫన్నీగా కామెంట్లు పెడుతున్నారు. మొత్తానికి పెళ్లి కార్డుతో పాటు స్వీటు బాక్స్, చీరెలు బహుమతిగా ఇవ్వడం చూశాం. కానీ ఇప్పడు ఏకంగా మందుబాటిల్ ఇచ్చి క్రియేటివిటీ చాటారు.