Begin typing your search above and press return to search.
స్ట్రెయిన్ వైరస్ భారత్ కి మార్చిలోనే వచ్చేసిందట!!
By: Tupaki Desk | 26 Dec 2020 11:30 AM GMTకరోనా వైరస్ కాస్త స్ట్రెయిన్ గా మారి ప్రపంచాన్ని కలవరపెడుతూ ఉంది. కొత్త రకం స్ట్రెయిన్ పలు దేశాల్లోకి అడుగుపెట్టకుండా ఉండేలా చూడాలని అన్ని దేశాలు కూడా ప్రయత్నిస్తూ ఉన్నాయి. భారత్ కూడా అందుకు సంబంధించి ఇప్పటికే జాగ్రత్తలు తీసుకుంది. కానీ ఈ ఏడాది మార్చిలోనే దేశంలోకి ప్రవేశించినట్టు కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ అనుబంధ సంస్థ ఇనిస్టిట్యూట్ ఆఫ్ జీనోమిక్స్ అండ్ ఇంటిగ్రేటివ్ బయాలజీ డైరెక్టర్ అనురాగ్ అగర్వాల్ తెలిపారు.
వైరస్ కు భిన్నమైన రకాలు మార్చిలోనే శాస్త్రవేత్తలు గుర్తించారని, వీటిలో ఒక రకాన్ని సూపర్ స్ప్రెడర్ గా గుర్తించి దానికి 'ఎ4' అని పేరు పెట్టారని తెలిపారు. హైదరాబాద్, ఢిల్లీ, కోల్‌కతాలలో సేకరించిన నమూనాల్లో ఈ 'ఎ4' మ్యుటేషన్ వైరస్ వెలుగు చూసింది. మనలోని రోగ నిరోధక వ్యవస్థ బలంగా ఉండడంతో జూన్ నాటికే ఈ సూపర్ స్ప్రెడర్ అంతమైందని అంటున్నారు అగర్వాల్. ప్రస్తుతానికైతే కంగారు పడాల్సిన అవసరం లేదని తెలిపారు.
దేశంలో పది నెలల్లో కరోనా వైరస్ ఎన్నో రూపాలు మార్చుకుందని, అది సాధారణంగా జరిగేదేనని అన్నారు. నెలకు సగటున వైరస్ లో రెండు ఉత్పరివర్తనాలు జరిగాయని.. వైరస్ మారినా అది సోకినప్పుడు కలిగే లక్షణాల్లో మాత్రం ఎలాంటి మార్పులు లేవన్నారు. కరోనా చికిత్స కూడా మారలేదని, మార్చాల్సిన అవసరమూ లేదని హామీ ఇచ్చారు. ప్రస్తుతం ట్రయల్స్ లో ఉన్న టీకాలన్నీ 'బ్రిటన్ వైరస్'పై సమర్థంగా పనిచేస్తాయని ధీమా వ్యక్తం చేశారు. వైరస్ లో మార్పులు జరిగితే.. దానిపైనా సమర్థంగా పనిచేసేలా శాస్త్రవేత్తలు, సంస్థలు టీకాల్లో మార్పులు చేయగలవని చెప్పారు.