Begin typing your search above and press return to search.
ఇండియా లో గుబులు రేపుతోన్న స్ట్రెయిన్ వైరస్ .. తెలుగు రాష్ట్రాల్లో కలకలం
By: Tupaki Desk | 25 Dec 2020 1:30 PM GMTకొత్త కరోనా వైరస్ స్ట్రెయిన్ దెబ్బకి ప్రపంచం మొత్తం వణికిపోతోంది. ఇప్పటికే కరోనా తో అందరి జీవితాలు అస్తవ్యస్తం అయ్యాయి. ఇప్పుడిప్పుడే కరోనాకి వ్యాక్సిన్ మార్కెట్లోకి వస్తుంది. ఇక అందరి జీవితాలు మళ్లీ మాములు అవుతాయి అనుకుంటున్న సమయంలో మళ్లీ బ్రిటన్ లో రూపాంతరం చెంది , స్ట్రెయిన్ గా వెలుగులోకి వచ్చి దడ పుట్టిస్తుంది. ఈ మహమ్మారి దేశంలోకి రాకుండా ప్రభుత్వం కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేస్తుంది. ఈ నేపథ్యంలోనే బ్రిటన్ నుంచి వచ్చిన వారిని గుర్తించే ప్రయత్నాలు చేస్తున్నాయి. కాగా, తెలంగాణ ప్రభుత్వం బ్రిటన్, ఆ దేశం మీదుగా తెలంగాణకు వచ్చిన ప్రయాణికులను గుర్తిస్తోంది.
ఇప్పటి వరకు తెలంగాణకు దాదాపు 1200 మంది వచ్చినట్లు ప్రాథమికంగా నిర్ధారించారు. ఇప్పటికే వారిలో 846 మందిని గుర్తించారు. బ్రిటన్ నుంచి వచ్చిన వారిని గుర్తించిన వారికి పరీక్షలు నిర్వహించగా , ఏడుగురికి కరోనా పాజిటివ్ గా తేలింది. వారిని స్థానిక టిమ్స్ ఆస్పత్రికి తరలించి ప్రత్యేకంగా ఉంచారు. పాజిటివ్ వచ్చిన వారి రక్త నమూనాలను పూణెలోని వైరాలజీ ల్యాబ్ కు పంపించారు. ఇక, పాజిటివ్ వచ్చిన వ్యక్తులతో ప్రాథమిక కాంటాక్ట్ ఉన్న వారిని నేచర్ క్యూర్‌కు తరలించారు. కాగా, బ్రిటన్ రిటర్న్స్ లో నెగిటీవ్ వచ్చిన వారిని కూడా మానిటరింగ్ లో పెట్టారు. కరోనా పాజిటివ్ గా వచ్చిన వారు హైదరాబాద్, వరంగల్, సిద్దిపేట, మేడ్చల్, జగిత్యాల జిల్లాలకు చెందిన వ్యక్తులుగా గుర్తించారు.
ఇక ,బ్రిటన్ నుంచి విశాఖపట్నానికి 211 మంది వచ్చినట్లు అధికారులు గుర్తించారు. వారిలో 167 మందిని ఇప్పటికే గుర్తించారు. కాగా, నవంబరు 25 నుంచి డిసెంబరు 23 వరకు యూకే నుంచి వచ్చిన వారి వివరాలను అధికారులు సేకరిస్తున్నారు. అలాగే బ్రిటన్ నుంచి విశాఖపట్నానికి వచ్చిన అందరికి అధికారులు టెలీఫోన్ స్క్రీనింగ్ చేశారు. అయితే ఎవరు కూడా తమకు కరోనా లక్షణాలు కనిపించడం లేదని చెప్పడంతో అధికారులు అంతా ఊపిరి పీట్సుకున్నారు. అంతేకాకుండా విదేశాల నుంచి వచ్చిన ప్రతీ ఒక్కరిని 14 రోజుల పాటు హోం క్వారంటైన్‌లో ఉండాలని వైద్యాధికారులు సూచిస్తున్నారు. ఇక ఈ బ్రిటన్ వైరస్ రాజమండ్రి లో కలకలం రేపిన సంగతి తెలిసిందే. రాజమండ్రికి చెందిన ఓ మహిళ విదేశాల నుంచి రాగా, ఆమెకు కరోనా పాజిటివ్ గా తేలింది. దీంతో ఆమెతో రైలులో ప్రయాణించి విశాఖకు చేరిన ప్రయాణికుల వివరాలను అధికారులు సేకరిస్తున్నారు. ఆ మహిళకు సోకింది జన్యు మార్పిడి చెందిన కొత్త వైరసా, లేకా పాత వైరసా అనే దానిపై ఎలాంటి క్లారిటీ లేదు. వారి రక్త నమూనాలు సేకరించి పరీక్షించారు. ఆ తర్వాత కాకినాడలోని వైరాలజీ ల్యాబ్ లో ఆర్టీపీసీఆర్ పరీక్షలు నిర్వహించగా, ఆమెకు కరోనా పాజిటివ్ తేలగా, ఆమె కుమారుడికి నెగిటివ్ తేలింది. అయితే కొత్త రకం వైరస్ ను గుర్తించేందుకు వైద్య ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో హైదరాబాద్ లోని సీసీఎంబీకి పంపించారు.