Begin typing your search above and press return to search.
కట్నంగా 21 తాబేళ్లు, నల్లకుక్క , పెళ్ళికొడుకు వింత కోరిక , ఆ తర్వాత ఏమైందంటే ?
By: Tupaki Desk | 24 July 2021 6:30 AM GMTపెళ్లి జీవితంలో జరిగే ఒకేఒకసారి జరిగే అతి పెద్ద వేడుక. అయితే, ఆ పెళ్లి ని పలువురు వరకట్న వేధింపులతో అపహాస్యం చేస్తున్నారు. పెళ్లి సమయంలో వర కట్నం తీసుకోవడం అనేది నిషేధం. అయినప్పటికీ అమ్మాయి తరపు వారు గిఫ్ట్ అంటూ వరకట్నం ఇస్తూనే ఉన్నారు. అయితే అత్తింటి వారు ఇచ్చిన వరకట్నం చాలదు అంటూ , ఇంకా కట్నం తీసుకురా అంటూ భార్యను వేదించే వారు చాలామంది ఉన్నారు. అలాగే , పెళ్లి కి ముందేనిర్ణయించుకున్న కట్నం కంటే ఎక్కువ కావాలని కోరే వారు ఉన్నారు. ఎన్ని చట్టాలు వచ్చినా దేశంలో వరకట్న వేధింపులకు అడ్డుకట్ట పడటం లేదు.
నిత్యం ఏదో ప్రాంతంలో వేధింపులు బయటపడుతూనే ఉన్నాయి. తాజాగా మహారాష్ట్రలో వరకట్నంతో ఓ పెళ్లికొడుకు వింత కోరికలు కోరిన ఘటన వెలుగులోకి వచ్చింది. ఆ ఘటన వివరాల్లోకి వెళ్తే ఔరంగాబాద్ నగరానికి చెందిన ఓ యువకుడికి ఫిబ్రవరిలో నిశ్చితార్థం జరిగింది. కట్నంగా వధువు తల్లిదండ్రులు వరుడికి రూ.2 లక్షల నగదు, తులం బంగారం ముందుగానే ఇచ్చారు. ఆ తర్వాత అందరూ పెళ్లి ఏర్పాట్లలో మునిగిపోయారు. అంతా సవ్యంగా సాగిపోతోందని అనుకుంటున్న సమయంలో వరుడు తన వింత కోరికల చిట్టాను బయటపెట్టాడు.
తనకు కట్నంగా రూ.10లక్షలు కావాలని డిమాండ్ చేయడంతో పాటూ 21 తాబేళ్లు, ఓ నల్ల కుక్క, బుద్ధుడి బొమ్మ, దీపం కుందెలు కావాలని పట్టుబట్టాడు. దీంతో వధువు కుటుంబం ఒక్కసారిగా షాకైంది. ఇలాంటి వింత కోరికలు వద్దంటూ వరుడికి నచ్చచెప్పే ప్రయత్నం చేసినా అతడు వెనక్కి తగ్గలేదు. ఎంత బ్రతిమాలినా వరుడు మనసు మార్చుకోకపోవడంతో తాను పెళ్లి చేసుకోకని తెగేసి చెప్పాడు. దీనితో వధువు కుటుంబసభ్యులు పోలీసులను ఆశ్రయించారు. అతడిపై చీటింగ్ కేసు నమోదు చేసి అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు.