Begin typing your search above and press return to search.
ఇండోనేషియాలో వింత: గర్భం దాల్చిన గంటకే ప్రసవం
By: Tupaki Desk | 26 July 2020 7:50 AM GMTఓ బిడ్డకు జన్మనివ్వాలంటే 8 నుంచి 9 నెలలు తప్పనిసరిగా గర్భం ఉండాల్సిందే. పిండం నుంచి శిశువుగా రూపం దాల్చడానికి ఆ సమయం పడుతుంది. గర్భంలో పిండం నుంచి బిడ్డగా కావడానికి 9 నెలల సమయం. ఇది అందరికీ తెలిసిన విషయం తెలిసిందే. అయితే ఇండోనేషియాలో మాత్రం విచిత్రం జరిగింది. గర్భం దాల్చిన ఓ గంటలోనే ఓ పాపకు జన్మనిచ్చింది. దీంతోపాటు శృంగారం లేకుండానే ఆ బిడ్డ పుట్టడం మరో విశేషం. సృష్టికి విరుద్ధంగా జరిగిన ఈ ఘటన ఇండోనేషియాలోని మండలసరీ గ్రామంలో చోటుచేసుకుంది.
ఆ గ్రామంలో 30 ఏళ్ల హెనీ నురేని నివసిస్తోంది. ఆమె శరీరంలో గర్భానికి సంబంధించిన ఎలాంటి లక్షణాలు కనిపించలేదు. అయితే జూలై 18వ తేదీ రాత్రి అకస్మాత్తుగా ఆమెకు వాంతులు అయ్యాయి. ఉన్నట్టుండి కడుపు ఉబ్బడం మొదలైంది. అనంతరం ఓ గంట తర్వాత తీవ్ర నొప్పులు వచ్చాయి. ఆ క్రమంలోనే ఓ గంటకు ఓ బిడ్డకు జన్మనిచ్చింది. ఈ ఘటన ఆ దేశంతో పాటు సోషల్ మీడియాలో సెన్సేషనల్ అయ్యింది. అయితే మరో విచిత్రం ఏమిటంటే.. ఆమె 19 నెలలుగా భర్తతో శృంగారంలో పాల్గొనలేదు. ఇలా విచిత్ర ఘటన చోటుచేసుకోవడంపై శాస్త్రవేత్తలు అధ్యయనం చేస్తున్నారు.
హెనీకి ఇప్పటికే ఇద్దరు పిల్లలు ఉన్నారు. 9 నెలలుగా ఆమెకు రుతుస్రావం క్రమం తప్పకుండా జరుగుతుంది. ఒకవేళ అది ఆగినా ఆమె గర్భవతి అనే విషయం తెలిసేది. 19 నెలలుగా శృంగారానికి దూరంగా ఉండడం ఇలా ఏ విధంగా చూసినా ఆమెకు గర్భం రావడానికి ఆస్కారమే లేదు. అయినా ఆమెకు ప్రసవం కావడం వింతగా మారింది. రెండో ప్రసవం తర్వాత ఆమె అనారోగ్యం చెందడంతో రెండేళ్లు సెక్సుకు దూరంగా ఉంటోంది. ఈ విషయం తెలిసి వైద్యులు.. మీడియా ఆమె వద్దకు వెళ్లగా ఆమె ఎలాంటి వివరాలు చెప్పడం లేదు. ఆమె తనను వదిలేయాలని ప్రాధేయపడింది. దీంతో ఆమెతో ఎవరూ మాట్లాడలేదు. అయితే ఈ ఘటనపై కొందరు వైద్యులు కారణాలు చెబుతున్నారు. కొందరు మహిళలు లక్షణాలు కనిపించకుండానే గర్భం దాల్చే అవకాశాలు ఉన్నాయని తెలిపారు. దీనిపై అధ్యయనం చేస్తున్నట్లు కొందరు శాస్త్రవేత్తలు చెబుతున్నారు.