Begin typing your search above and press return to search.
అధ్యక్షుడి వీడియో కాన్ఫరెన్స్ లో నగ్నంగా ప్రత్యక్షం అయిన వ్యక్తి !
By: Tupaki Desk | 18 May 2020 11:30 PM GMTఈ మహమ్మారి ప్రభావం అనేక రంగాలపై పడింది. దీనితో పలు సంస్థలు తమ ఉద్యోగులకి వర్క్ ఫ్రమ్ హోమ్ ఇవ్వడం జరిగింది. అలాగే కొంతమంది అధికారులు సైతం ఇళ్లలో నుంచే వీడియో కాన్ఫరెన్స్ ల ద్వారా సమీక్షలు జరుపుతున్నారు. అయితే ఇలాంటి సమయాల్లో కొన్ని చిత్రవిచిత్ర సంఘటనలు ఎదురవుతున్నాయి. తాజాగా దేశాధ్యక్షునికి సైతం ఓ చేదు అనుభవం ఎదురైంది. ఆచేదు అనుభవం ఏమిటి అంటే?
ఈ ఘటన పై పూర్తి వివరాలు చూస్తే .. మహమ్మారి కట్టడిలో భాగంగా అనుసరిస్తున్న లాక్ డౌన్ ఫలితాలపై చర్చిందుకు సావో పాలో ఫెడరేషన్ ఆఫ్ ఇండస్ట్రీస్ అధ్యక్షుడు పాలో స్కాఫ్ జూమ్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించాడు. ఇందులో బ్రెజిల్ అధ్యక్షుడు జైర్ బొల్సనారోతో పాటు పది మంది ఇతర అధికారులు కూడా పాల్గొన్నారు. ఇంతలోనే ఆ వీడియో కాల్ లో ఓ వ్యక్తి నగ్నంగా ప్రత్యక్షమయ్యాడు. దీంతో ఒక్కసారిగా షాక్ అయిన అధ్యక్షడు జైల్ బొల్సనారో... పాలో, ఈ కాల్ లో చివర్లో ఉన్న వ్యక్తి బాగానే ఉన్నాడు కదా?" అని అనుమానాన్నివ్యక్తం చేసాడు.
దీనితో వెంటనే స్పందించిన సంబంధిత అధికారులు సదరు వ్యక్తిని కాన్ఫరెన్స్ నుంచి తొలగించారు. ఈ వీడియో పై పరిశ్రమల శాఖ మంత్రి పాలో గ్యూడ్స్ మాట్లాడుతూ.. "అతను నగ్నంగా స్నానం చేస్తున్నాడు. ఈ మీటింగ్ వేడి వేడిగా జరుగుతోంది. అందుకని అతను చన్నీళ్లతో స్నానం చేస్తున్నాడు" అని చెప్పుకొచ్చాడు. ఈ వీడియో కాన్ఫరెన్స్ కు సంబంధించిన ఫొటో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇలాంటి ఘటనలు ఇప్పటికే చాలా వెలుగులోకి వచ్చిన సంగతి తెలిసిందే.