Begin typing your search above and press return to search.
ఆ దేశాల్లో రూల్స్ తెలిస్తే.. చచ్చినా వెళ్లటానికి ఇష్టపడం
By: Tupaki Desk | 13 Jun 2022 5:03 AM GMTప్రపంచంలో వింతలకు.. విశేషాలకు అస్సలు కొదవ ఉండదు. నిద్ర లేచింది మొదలు పడుకునే వరకు ఎప్పుడైనా.. ఎక్కడైనా.. ఏదైనా చర్చ వచ్చినంతనే మన దేశంలో కంటే ఆయా దేశాల్లో బతుకులు ఎంత బాగుంటాయో.. మరెంత రిచ్ గా ఉంటాయన్న మాటలు చాలామంది నోటి నుంచి వినిపిస్తూ ఉంటుంది.
ఎవరేం అనుకున్నా.. భారత దేశానికి మించిన దేశం మరొకటి ఉండదనే చెప్పాలి. ఇక్కడున్న స్వేచ్ఛ.. ఇక్కడ సంతోషంగా బతకటానికి ఉన్న అవకాశాలు అన్ని ఇన్ని కావు. ఇదంతా ఒక ఎత్తు అయితే.. మిగిలిన దేశాల్లో అమలు చేసే కొన్ని రూల్స్ గురించి తెలిసిన తర్వాత.. మన దేశంలో మన ఎంత హాయిగా.. ప్రశాంతంగా బతుకుతున్నామో ఇట్టే అర్థమవుతుంది.
నవ్వు ఆరోగ్యానికి మూలమని నమ్మే మన తీరుకు పూర్తి భిన్నంగా.. నవ్వితే చాలు ఫైన్ వేసే రూల్ ఒక సుందర నగరంలో ఉందని చెబితే నమ్ముతారా? అస్సలు నో అంటే నో అనేస్తారు. కానీ.. ఇది నిజం. అంతేనా.. స్నానం చేయకుండా నిద్ర పోతే కూడా ఫైన్ వేసే నగరం ఉందంటే నమ్మరు.
కానీ.. ఇవన్నీ నిజాలే. ఇలాంటి సిత్రమైన నిబంధనలు ప్రపంచంలోని పలు దేశాల్లోని నగరాల్లో అమలు చేస్తుంటారు. ఎందుకిలా? అనే దానికి సరైన సమాధానం చెప్పరు కానీ.. ఎన్నో ఏళ్ల నుంచి అమలవుతున్న ఈ తరహా చట్టాలు చాలా సిత్రంగా అనిపిస్తాయి.
అమెరికాలోని శాన్ ఫ్రాన్సిస్కోలో ఎవరైనా కారును లోదుస్తుల (డ్రాయర్లు.. బనీన్లు)తో క్లీన్ చేస్తే ఫైన్ విధిస్తారు. ఇక.. సుందర దేశంగా పేర్కొనే ఇటలీలోని మిలాన్ సిటీలో మరో విచిత్రమైన రూల్ అమలు చేస్తారు. ఇక్కడ ఎవరైనా నవ్వినట్లు కనిపిస్తే ఫైన్ వేస్తారు. అంటే.. బహిరంగంగా ఎవరూ నవ్వకూడదు. అప్పుడెప్పుడో చట్టాన్ని నేటికి అమలు చేస్తుండటం గమనార్హం. ఇక.. ఇంగ్లండ్ లోని మసాచుసెట్స్ లోని స్నానం చేయకుండా నిద్రపోతే జైల్లో పెట్టేస్తారట.
ఇలాంటి నిబంధనలు మన దేశంలో అమలు చేస్తే.. జైళ్లు సరిపోవేమో. ఇలాంటి చెత్త రూల్స్ ను చూసినప్పుడు మన దేశంలో బతకటానికి మించిన లక్ మరెక్కడా ఉండదనిపించక మానదు. విచిత్రమైన అంశం ఏమంటే.. ఎప్పుడో కొన్నేళ్ల క్రితం పెట్టిన రూల్స్ ను కాలానికి అనుగుణంగా మార్చుకోవాలి కదా? అలా కాకుండా మెకానికల్ గా అర్థంపర్థం లేని వాటిని నేటికి ఫాలో కావటం ఏమిటో?