Begin typing your search above and press return to search.

కాంగ్రెస్ వ్యూహకర్తగా మోడీ మెచ్చినోడు

By:  Tupaki Desk   |   1 March 2016 11:40 PM IST
కాంగ్రెస్ వ్యూహకర్తగా మోడీ మెచ్చినోడు
X
వరుస పరాజయాలతో నిరాశలోకి కూరుకుపోతున్న కాంగ్రెస్ కు కొత్త జవసత్వాలు తెచ్చేందుకు కొత్త వ్యూహకర్తను తీసుకొచ్చింది. సార్వత్రిక ఎన్నికల్లో మోడీ బ్యాచ్ కి ఎన్నికల వ్యూహాల్ని అందించి ఘన విజయంసాధించేలా చేయటమే కాదు.. తన సత్తా ఏమిటన్నది ఈ మధ్యనే ముగిసిన బీహార్ ఎన్నికల్లోనూ ప్రదర్శించిన ప్రశాంత్ కిశోర్ ను తన పక్కకు తెచ్చుకునేందుకు కాంగ్రెస్ చేసిన ప్రయత్నాలు ఫలించాయి.

తన అద్భుత చాణుక్యంతో ఎన్నికల వ్యూహాన్ని సిద్ధం చేసే మొనగాడిగా పేరున్న ఆయన రానున్న రోజుల్లో కాంగ్రెస్ పార్టీకి తన సేవల్ని అందించనున్నాడు. త్వరలో పంజాబ్.. ఉత్తరప్రదేశ్ రాష్ట్రాలకు జరిగే అసెంబ్లీ ఎన్నికలకు కాంగ్రెస్ పార్టీకి ఆయన సేవలు అందించనున్నారు. బీహార్ ఎన్నికల సందర్భంగా మహా కూటమి ఆవిర్భావం కోసం ప్రశాంత్ కిశోర్ వ్యూహాలు రూపొందించటమే కాదు.. తాను చెప్పింది ఎలా నిజం అవుతుందో కూడా చేతల్లోచేసి చూపించిన ట్రాక్ రికార్డు ఆయన సొంతం.