Begin typing your search above and press return to search.
దేశంలో కొత్తగా రెండు జాతీయ పార్టీలు ఎవరి బలం ఎంత?
By: Tupaki Desk | 9 Dec 2022 4:01 AM GMTదేశ రాజకీయాల్లో సంచలన మార్పులు చోటు చేసుకుంటున్నాయి. కొత్తగా రెండు జాతీయ పార్టీలు ఏర్పడ్డా యి. ఇక, ఇవి వచ్చే సార్వత్రిక ఎన్నికలను దృష్టి పెట్టుకుని దేశంలో సంచలనం సృష్టించాలని భావిస్తున్నాయి. మరి వాటి బలాబలాలు ఎంత? ఏమేరకు అవి పుంజుకునే శక్తి ఉంది? అసలు వాటిని ప్రజలు ఎంత వరకు ఆమోదిస్తారు? ఆదరిస్తారు? అనే చర్చ తెరమీదికి వచ్చింది.
ఆ రెండు పార్టీలే.. ఒకటి ఢిల్లీలో అధికారంలో ఉన్న ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్). రెండు తెలంగాణలో అధికారం లో ఉన్న తెలంగాణ రాష్ట్ర సమితి(టీఆర్ఎస్). ఈ రెండు పార్టీలు కూడా త్వరలోనే దేశ వ్యాప్తంగా చక్రం తిప్పేందుకు రెడీ అవుతున్నాయి. అయితే.. వీటి బలాలు ఎంత? ఏమేరకు దేశ ప్రజలను తమవైపు తిప్పుకొంటాయి? ఏయే పథకాలతో ఆకట్టుకుంటాయి? వీటికి దేశంలోని ఇతర పక్షాలు ఎలా కలిసివస్తాయి? అనే చర్చ జోరుగా సాగుతోంది.
విషయంలోకి వెళ్తే.. తెలంగాణ రాష్ట్రసమితి పార్టీని భారత రాష్ట్ర సమితిగా కేంద్ర ఎన్నికల సంఘం గుర్తిం చింది. అయితే, ఈ పార్టీ దక్షిణాదికి మాత్రమే పరిచయం. ఇప్పటి వరకు ఉన్న రాజకీయాలను తీసుకుం టే.. రెండు తెలుగు రాష్ట్రాలకు పొరుగున ఉన్న కర్ణాటకకు, మహారాష్ట్రకు మాత్రమే తెలుసు. యావత్ భారతాన్ని తీసుకుంటే.. అతి పెద్ద రాష్ట్రం యూపీ, బీహార్, పంజాబ్, రాజస్థాన్, పశ్చిమ బెంగాల్ వంటి రాష్ట్రాలకు కేసీఆర్ ఎవరో తెలియదు. ఆయన పార్టీ కూడా తెలియదు.
సో.. బీఆర్ ఎస్ పార్టీ ప్రజలకు తెలియాలి.. పుంజుకోవాలి. పైగా రాజకీయంగా ఆయా రాష్ట్రాల్లో పట్టు దక్కించుకోవాలి.. అంటే.. ఏడాదిన్నర కాలంలో ఏమాత్రం సాధ్యమవుతుందో చూడాలి. ఇక, కలిసి వచ్చే పార్టీలను తీసుకుంటే.. కొన్ని ఉన్నప్పటికీ.. ఏ పార్టీకి ఆ పార్టీ స్థానికంగా బీఆర్ ఎస్ పోటీ అవుతుందని అంటే చోటు ఇచ్చే అవకాశం లేదు. బీఆర్ ఎస్ ఎంట్రీతోతమకు లాభం ఉండాలని కోరుకునే నాయకులు ఉన్నారే తప్ప.. తమకు బీఆర్ ఎస్‌తో నష్టపోయేందుకు ఏ పార్టీ కూడా అంగీకరించే పరిస్థితి లేదు.
సో.. ఈపరిణామాలను గమనిస్తే..వెళ్తే.. బీఆర్ ఎస్ ఒంటరిగా వెళ్లాలి. లేకపోతే, పొత్తులు పెట్టుకున్నా.. అవి ఏరూపంలో ఉంటాయో చూడాలి. ప్రస్తుతం మోడీని ఎదిరించి కేసీఆర్‌తో చేతులు కలిపే నాయకులు తగ్గిపోతున్నారు. ఇక, ఆప్ విషయానికి వస్తే.. ఇది ఇప్పటికే రెండు రాష్ట్రాల్లో అధికారంలో ఉంది. ఢిల్లీ, పంజాబ్ లో చక్రం తిప్పుతోంది.ఇక, గుజరాత్, గోవాల్లోనూ సీట్లు సంపాయించుకుంది.
అంటే.. దాదాపు ఆయా రాష్ట్రాలను లెక్కవేసుకున్నా.. ఓటు బ్యాంకు పెరుగుతోంది. సో.. ఆప్ జాతీయ పార్టీగా వచ్చే ఎన్నికల నాటికి పుంజుకునేందుకు పెద్దగా కష్టించాల్సిన అవసరం లేదు. పైగా ఎక్కడా కూడా పొత్తులకు సిద్ధపడడం లేదు. సో.. ఆప్ ఒంటరిపోరుతోనే సార్వత్రికానికి సిద్ధపడుతోందనడంలో సందేహం లేదు. మొత్తగా ఈ రెండు కొత్త జాతీయ పార్టీల్లో ఆప్ దూకుడు ఒకలా ఉంటే.. బీఆర్ ఎస్ ఇంకా నడకే ఆరంభించని స్టేజ్‌లో కనిపిస్తోంది. మరి ఎలా దూకుడు ప్రదర్శిస్తాయో చూడాలి.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.