Begin typing your search above and press return to search.

కరోనాపై రాష్ట్రాలకు కేంద్రం కీలక ఆదేశాలు

By:  Tupaki Desk   |   6 March 2020 9:40 AM GMT
కరోనాపై రాష్ట్రాలకు కేంద్రం కీలక ఆదేశాలు
X
ప్రపంచంతో పాటు ఇప్పుడు భారతదేశాన్ని కరోనా వైరస్ భయపెడుతోంది. దీని దెబ్బకు భారతదేశంలో తీవ్ర ప్రభావం ఏర్పడింది. ప్రజా జీవనం కొంత స్తంభించింది. అయితే దేశంలో కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతున్నాయనే పుకార్లతో ప్రజలు భయాందోళన చెందుతున్నారు. ఈ సమయంలో కేంద్ర ప్రభుత్వం పలు రాష్ట్రాలకు కీలక ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు రాష్ట్రాలతో కేంద్రం నిత్యం సంప్రదింపులు చేస్తూ వైరస్ వ్యాప్తి చెందకుండా చర్యలు తీసుకుంటోంది. ఈ మేరకు తెలంగాణ లో సత్ఫలితాలు వచ్చాయి. ఈ నేపథ్యంలో మరో ఆరు రాష్ట్రాలకు కేంద్రం హెచ్చరికలు జారీ చేసింది.

కరోనా పాజిటివ్ కేసులు నమోదవుతుండంతో కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. కేంద్ర హోంమంత్రిత్వ శాఖ స్పందించి ఆరు రాష్ట్రాలకు శుక్రవారం హెచ్చరికలు జారీ చేసింది. పశ్చిమబెంగాల్, బీహార్, ఉత్తరప్రదేశ్, పంజాబ్, సిక్కిం, ఉత్తరాఖండ్ రాష్ట్రాల్లో కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని కేంద్రం ఆ రాష్ట్రాలకు సూచించింది. కరోనా వైరస్ బాధితుల సంఖ్య 30కి చేరుకోవడంతో ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు అప్రమత్తంగా ఉండాలని పేర్కొంది. కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని సూచించింది. ఏమాత్రం అనుమానం వచ్చినా వెంటనే వారికి వైద్య పరీక్షలు చేయించాలని తెలిపింది.

ముఖ్యంగా సిక్కిం, ఉత్తరాఖండ్ మంచు ప్రదేశాలు కాగా ఉత్తరప్రదేశ్ లోని కొన్ని ప్రాంతాలు మంచుమయం కావడంతో కరోనా వైరస్ వ్యాప్తి చెందే అవకాశం ఉండడంతో ఆ రాష్ట్రాలను ఏ పరిణామం ఎదురైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని స్పష్టం చేసింది. వైరస్ వ్యాప్తి నివారణకు సహకరించాలని కోరింది.