Begin typing your search above and press return to search.
సంచలనం: విమానాన్ని ఆపిన చీమలు
By: Tupaki Desk | 7 Sep 2021 2:37 PM GMTవిమానం ఎంతుంటుంది.. మనిషియే అందులో చిన్న జీవిగా కనిపిస్తాడు. అలాంటిది చీమలు.. ఇంకా అత్యంత స్వల్ప జీవులనే చెప్పాలి. అలాంటి చీమలు ఇప్పుడు విమానాన్ని ఆపేశాయి. అలాంటి చిత్రమైన ఘటన ఢిల్లీ విమానాశ్రయంలో చోటుచేసుకుంది.
లండన్ వెళ్లే ఎయిర్ ఇండియా విమానం చీమల కారణంగా కొన్ని గంటలు ఆగడం సంచలనమైంది. బిజినెస్ క్లాసులో చీమల గుంపు కనిపించడంతో టేకాఫ్ ను ఆపేశారు. ప్రయాణికులను మరో విమానంలోకి ఎక్కించి పంపించారు.
ఢిల్లీ నుంచి లండన్ వెళ్లే ఈ ఎయిర్ ఇండియా విమానంలోనే భూటాన్ యువరాజు జిగ్మే నాంగ్మేల్ వాంగ్ చుక్ ఉండడం గమనార్హం.
ఎయిర్ ఇండియా విమానాలు ఇటీవల కాలంలో చిత్రమైన కారణాలతో ఆలస్యం అవుతున్నాయి. ఈ ఏడాది జులైలోనూ సౌదీ అరేబియా వెళుతున్న ఎయిర్ ఇండియా విమానం కేరళలోని తిరువనంతపురం విమానాశ్రయంలో అత్యవసరంగా ల్యాండ్ చేశారు. విమానం విండ్ షీల్డ్ లో పగుళ్లు గుర్తించడమే ఇందుకు కారణం. అంతకుముందు మేలో ఢిల్లీ నుంచి అమెరికా వెళుతున్న ఎయిర్ ఇండియా విమానం బిజినెస్ క్లాస్ లో గబ్బిలం ఉన్నట్టుగా గుర్తించి ఆపేశారు. ఇలా చిత్రమైన కారణాలతో నిర్వహణ లోపాలతో ఎయిర్ ఇండియా అభాసుపాలవుతోంది.