Begin typing your search above and press return to search.

రైతు ఆందోళనల్లో రైతు కొడుకు పెళ్లి కేంద్రానికి స్ట్రాంగ్ వార్నింగ్ !

By:  Tupaki Desk   |   20 March 2021 1:30 AM GMT
రైతు ఆందోళనల్లో రైతు కొడుకు పెళ్లి కేంద్రానికి స్ట్రాంగ్ వార్నింగ్ !
X
వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ దేశ రాజధాని ఢిల్లీ శివారుల్లో గత కొన్ని రోజులుగా రైతులు చేస్తున్న నిరసనలు తెలియజేస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో మధ్యప్రదేశ్‌లోని రేవాలో కూడా రైతులు వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ నిరసనలు తెలుపుతున్నారు. ఆ నిరసనలలో ఓ శుభకార్యం జరిగింది. నిరసనల్లో పాల్గొంటున్న భోపాల్ రైతు నాయకుడు రాంజిత్ సింగ్ కొడుకు పెళ్లి నిశ్చయమైంది. కొడుకు పెళ్లి కోసం ఉద్యమం నుంచి దూరం కాకూడదనుకున్నాడు. అందుకోసం వినూత్నంగా ఆలోచించిన రాంజిత్.. కొడుకు పెళ్లిని తమ నిరసనల మధ్యే చేయాలనుకున్నాడు.

ఆలోచన వచ్చిందే తడవుగా.. భోపాల్ ‌కు 500 కిలోమీటర్ల దూరంలోని రేవాలో జరుగుతున్న నిరసనల వద్ద తన కొడుకు సచిన్, కాబోయే కోడలు అస్మా సింగ్‌ల వివాహం జరిపించాడు. కేంద్ర ప్రభుత్వానికి స్ట్రాంగ్ మెసెజ్ ఇచ్చేందుకే ఇలా చేశామని రాంజిత్ సింగ్ తెలిపారు. ఎన్ని అవాంతరాలు వచ్చిన ఆందోళనలు విరమించేది లేదని ఆయన అన్నారు. కొత్త దంపతులిద్దరూ రాజ్యాంగాన్ని పరిరక్షించాలంటూ ప్రమాణం చేశారు. అనంతరం సావిత్రి భాయి పూలే, అంబేద్కర్ ఫోటోల చుట్టూ ఏడు అడుగులు నడిచారు. పెళ్లి సందర్భంగా వచ్చిన బహుమతులన్నింటిని అక్కడ ఉన్న రైతులకు పంచిపెట్టారు. ఈ పెళ్లి జరిపించిన రాంజిత్ సింగ్ ‌ని రైతులందరూ మెచ్చుకుంటున్నారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.