Begin typing your search above and press return to search.

బెడిసికొడుతున్న కాంగ్రెస్ వ్యూహం.. 'క‌ర్నూలు' కే ప‌రిమిత‌మా?

By:  Tupaki Desk   |   14 Oct 2022 3:37 PM GMT
బెడిసికొడుతున్న కాంగ్రెస్ వ్యూహం.. క‌ర్నూలు కే ప‌రిమిత‌మా?
X
ఏపీ విభ‌జ‌న కార‌ణంగా పుట్టిమునిగి.. అగ‌చాట్లు ప‌డుతున్న కాంగ్రెస్‌కు మ‌రో భారీ దెబ్బ‌ప‌డే సూచ‌న‌లు క‌నిపిస్తున్నాయి. ఇప్ప‌టికే కాంగ్రెస్ మాట‌.. చేత‌.. ఎక్క‌డా క‌నిపించ‌డం లేదు. సుదీర్ష చ‌రిత్ర‌ను సొంతం చేసుకున్న కాంగ్రెస్‌.. ఏపీలో అదే చ‌రిత్ర‌లో క‌లిసిపోయేలా ఉంద‌నే సంకేతాలు వ‌స్తున్నాయి. ఇప్ప‌టికే గ‌త రెండు ఎన్నిక‌ల్లోఒక్క‌టంటే ఒక్క సీటును గెలుచుకున్న ప రిస్థితి లేక‌పోగా క‌నీసం.. డిపాజిట్ల‌ను కూడా ద‌క్కించుకున్న ప‌రిస్థితి లేకుండా పోయింది.

మ‌రి ఇప్ప‌టికైనా.. ప్ర‌జ‌ల మ‌న‌సు దోచుకునేలా .. కాంగ్రెస్ ప్ర‌య‌త్నాలు చేస్తోందా? అంటే..లేద‌నే చెప్పాలి. కీల‌క నేత‌లు అంద‌రూ... నోటికి తాళాలు వేసుకున్నారు. ఇక‌, మిగిలిన నాయ‌కులు మౌనంగా ఉన్నారు. అయితే.. జాతీయ‌స్థాయిలోమాత్రం కాంగ్రెస్ పుంజుకునే ప్ర‌య‌త్నాలు చేస్తోంది. ఈ క్ర‌మంలోనే రాహుల్‌గాంధీ.. భార‌త్ జోడో యాత్ర‌ను ప్రారంభించారు. అంతేకాదు.. కేంద్రంలో కాంగ్రెస్‌ అధికారంలోకి వ‌స్తే.. తాము ప్ర‌త్యేక హోదా ఇస్తామ‌ని కూడా..చెబుతున్నారు.

మ‌రి ఇంత జ‌రుగుతున్నా..కాంగ్రెస్ నేత‌లు మాత్రం.. మౌనంగానే ఉన్నారు. ఈ విష‌యాన్ని ప్ర‌జ‌ల్లోకి తీసుకువెళ్ల‌డంలోనూ.. ప్ర‌జ‌ల చేతితో జై కొట్టించుకోవ‌డంలోనూ వారు పూర్తిగా విఫ‌ల‌మ‌వుతున్నార‌ని చెబుతున్నారు. తాజాగా జోడో యాత్ర ఏపీలోకి అడుగు పెడుతోంది. అయితే.. ఈ యాత్ర‌ను ఎవ‌రు డిజైన్ చేశారో..కానీ.. ఏపీలో కేవ‌లం క‌ర్నూలు జిల్లా వ‌ర‌కు ప‌రిమితం కావ‌డం... గ‌మ‌నార్హం. ఉమ్మ‌డి క‌ర్నూలు జిల్లాలో మాత్ర‌మే ఈ యాత్ర సాగ‌నుంది.ఇది.. పార్టీకి ఎలా ప్ల‌స్ అవుతుందో.. నాయ‌కులే చెప్పాలి.

మ‌రోవైపు.. పార్టీ పుంజుకోవాల‌ని.. అధిష్టానం కోరుతుంటే.. ఈయాత్ర‌ను క‌నీసం.. సీమ‌లోని జిల్లాల‌ను ట‌చ్ చేసేలా అయినా.. చూడాలి క‌దా.. అప్పుడే క‌దా.. రాహుల్‌.. యాత్ర ఉద్దేశం ప్ర‌జ‌ల‌కు తెలుస్తుంది. కానీ.. నాయ‌కులు మాత్రం క‌నీసం.. ఈకోణంలో ఆలోచించిన‌ట్టుగా క‌నిపించ‌డం లేద‌ని.. కాంగ్రెస్ పార్టీ అభిమానులు వ‌గ‌స్తున్నారు. మ‌రి ఇప్ప‌టికైనా.. కాంగ్రెస్‌నేత‌లు పుంజుకుంటారో లేదో చూడాలి. లేక‌పోతే.. ఇక‌, కాంగ్రెస్ చ‌రిత్ర‌లో పూర్తిగా కూరుకుపోవ‌డం ఖాయం అంటున్నారు ప‌రిశీల‌కులు.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.