Begin typing your search above and press return to search.
12 ఏళ్ల అమ్మాయి దెబ్బకు ఆ నగరం వణికిపోయింది
By: Tupaki Desk | 15 Feb 2019 5:27 AM GMTనిండా పన్నెండేళ్లు లేవు. కానీ.. ఆ చిన్నారి చేసిన చిలిపి పనికి ఆమె నివసిస్తున్న ప్రాంతం వణికిపోయింది. ఇక.. రెండు స్కూళ్లు అయితే మూతపడిన పరిస్థితి. అంతలా ఆ అమ్మాయి ఏం చేసింది? ఆమె చేసిన చిలిపి పని ఏమిటి? అన్న విషయంలోకి వెళితే..
అమెరికాలోని టంపా నగరానికి చెందిన ఒక పన్నెండేళ్ల అమ్మాయి ఫార్నెల్ మిడిల్ స్కూల్లో చదువుతోంది. తాజాగా వాష్ రూంకి వెళ్లిన ఆ అమ్మాయి.. తిరిగి వచ్చి తన తోటి విద్యార్థులకు.. టీచర్లకు తాను వాష్ రూం నుంచి వచ్చే టైంలో నల్లి దుస్తులు ధరించిన ఒక వ్యక్తి కనిపించాడని.. తల నుంచి పాదాల వరకూ బ్లాక్ డ్రెస్ వేసుకున్న అతని దగ్గర తుపాకీ ఉందని చెప్పింది.
వెంటనే స్కూల్ యాజమాన్యం అలెర్ట్ అయ్యింది. హుటాహుటిన పోలీసులకు సమాచారం అందించారు. వారింతగా భయపడటానికి కారణం లేకపోలేదు. ఏడాది క్రితం ఇదే ప్రాంతంలోని ఒక స్కూల్లో జరిగిన భయానక దాడి నేపథ్యంలో పోలీసులు సైతం ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. భారీ బలగంతో ఆ స్కూల్ కి.. సమీపంలోని మరో స్కూల్ కు వెళ్లారు.
ఆ రెండు స్కూళ్లను మూయించారు. ఆ ప్రాంతమంతా జల్లెడ పట్టారు. కానీ.. సదరు ముసుగు మనిషి కనిపించలేదు.
దీంతో.. ఈ సమాచారం మీ వరకూ ఎలా వచ్చిందంటూ స్కూల్ సిబ్బందిని అధికారులు ప్రశ్నించారు. దీనికి వారు.. తమకు 12 ఏళ్ల చిన్నారి ఈ సమాచారం చెప్పినట్లు వెల్లడించారు.
వెంటనే.. ఆమెను తీసుకొచ్చిన అధికారులు.. ముసుగు వ్యక్తిని ఎక్కడ చూశావని ప్రశ్నించారు. సమాధానం చెప్పేందుకు ఆమె తడబడటం.. పొంతన లేని సమాధానాలు చెప్పటంతో గట్టిగా అడిగారు. దాంతో ఆ చిన్నారి అసలు విషయాన్ని వెల్లడిస్తూ.. తాను సరదాగా చెప్పానని.. తానెవరిని చూడలేదన్న అసలు విషయాన్ని చెప్పారు. దీంతో పోలీసులు ఊపిరి పీల్చుకున్నారు. ఇంతలా ఉరుకులు పరుగులు పెట్టటానికి కారణమైన ఆ అమ్మాయిని అదుపులోకి తీసుకున్నారు. అనంతరం బాండ్ పూచీ కత్తుతో ఆమెను విడుదల చేశారు. చిలిపిదనానికి ఒక హద్దు ఉండాలి. లేకుంటే చిక్కులు ఖాయం.