Begin typing your search above and press return to search.
మంత్రి మల్లా రెడ్డి కాలేజీ లో దారుణం.. ల్యాబ్ లో విద్యార్థి ని అత్యాచారం
By: Tupaki Desk | 25 Dec 2019 4:42 AM GMTదారుణం చోటు చేసుకుంది. ఒక పేరున్న ప్రముఖ ఇంజనీరింగ్ కాలేజీలో ఒక విద్యార్థినిపై అసిస్టెంట్ ప్రొఫెసర్ గా పని చేసే అధ్యాపకుడు కాలేజీ ల్యాబ్ లోనే రేప్ చేసిన వైనం సంచలనంగా మారింది. దిశ ఘటన దేశాన్ని కుదిపేయటం.. నిందితులు ఎన్ కౌంటర్ అయ్యాక కూడా అత్యాచారాలకు అడ్ డుకట్ట పడక పోవటమే కాదు.. అంతకంతకూ పెరిగి పోతున్న తీరు ఆందోళన కలిగించేదిగా ఉందని చెప్పాలి. భారీ క్యాంపస్ లోనే ఇలాంటి దారుణం చోటు చేసుకోవటంపై అవాక్కు అవుతున్నారు.
వాస్తవానికి ఈ ఘటన సోమవారం జరిగినప్పటికీ కాస్త ఆలస్యంగా బయటకు వచ్చింది. నల్గొండ జిల్లా కు చెందిన వెంకటయ్య అలియాస్ వెంకట్ ఇంజనీరింగ్ పూర్తి చేసి నగరానికి వచ్చాడు. భార్య.. ఇద్దరు పిల్లలతో కలిసి ఓయూ మాణిక్యనగర్ లో ఉంటున్నాడు. మైసమ్మ గూడలోని మల్లారెడ్డి ఇంజనీరింగ్ కళాశాలల ప్రాంగణంలోని మూడో క్యాంపస్ లో అసిస్టెంట్ ప్రొఫెసర్ హోదాలో ల్యాబ్ ఇన్ చార్జిగా పని చేస్తున్నాడు.
అదే కాలేజీ లో చదివే సెకండ్ ఇయర్ అమ్మాయిని ల్యాబ్ లో అత్యాచారం చేశాడు. వాస్తవానికి.. సెకండ్ ఇయర్ అమ్మాయితో వెంకట్ పరిచయం ఎలా జరిగిందన్నది చూస్తే.. కొన్ని నెలల క్రితం ఆ అమ్మాయి రూ.50 కోసం తన స్నేహితుల్ని అడుగుతుండగా చూసిన వెంకట్.. ఆ మొత్తాన్ని తాను ఇస్తానని చెప్పి ఇచ్చారు. ల్యాబ్ ఇన్ ఛార్జి కావటం.. అసిస్టెంట్ ప్రొఫెసర్ కావటం తో ఆ అమ్మాయి కాదనలేక పోయింది. అలా మొదలైన పరిచయం కాస్త పెరిగింది.
మంచిగా మాట్లాడుతుండటం తో ఆ విద్యార్థి ని అపాయాన్ని గుర్తించలేదు. అయితే.. రెండు నెలలుగా ఆమెను లైంగికంగా వేధిస్తున్నాడు. ఇదిలా ఉండగా సోమవారం కాలేజి నుంచి వెళుతున్న వేళ.. ల్యాబ్ లోని కొన్ని పరికరాల్ని తీసుకెళ్లటానికి సాయం చేయాల్సింది గా సదరు విద్యార్థిని కోరారు. అతన్ని నమ్మి ల్యాబ్ లోకి వెళ్లిన ఆమెపై అత్యాచారం చేశాడు. దీంతో షాక్ తిన్న విద్యార్థిని.. ఉదయం కోదాడకు వెళ్లి తల్లిదండ్రులకు జరిగిన విషయాన్ని చెప్పి భోరుమంది. వెంటనే వారు పోలీసులకు సమాచారం అందించగా.. స్పందించిన పోలీసులు నిందితుడు వెంకట్ ను అదుపు లోకి తీసుకొని విచారిస్తున్నారు.