Begin typing your search above and press return to search.
ఆ సీఎం ఇచ్చిన చెక్ బౌన్స్ అయ్యింది
By: Tupaki Desk | 9 Jun 2018 11:11 AM GMTకొన్నిసార్లు అంతే. తప్పు చేయకున్నా ఫలితం అనుభవించాల్సి వస్తుంది. తాజాగా అలాంటి ఉదంతమే ఉత్తరప్రదేశ్ లో చోటుచేసుకుంది. ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఇచ్చిన చెక్ బౌన్స్ అయ్యింది. దీంతో.. ముఖ్యమంత్రి చేతలు మీదుగా లక్ష రూపాయిల నజరానా పొందిన విద్యార్థికి నోట మాట రాని విచిత్రమైన పరిస్థితి ఎదురైంది. అసలేమైందంటే..
ఉత్తరప్రదేశ్ లో పదో తరగతి బోర్డు పరీక్షలో అలోక్ మిశ్రా అనే విద్యార్థి ఏడో ర్యాంక్ సాధించాడు. దీంతో.. అతనికి ముఖ్యమంత్రి యోగి లక్ష రూపాయిల క్యాష్ అవార్డును చెక్ రూపంలో ఇచ్చారు. సీఎం చేతుల మీదుగా క్యాష్ ప్రైజ్ అందుకోవటంతో విద్యార్థితో పాటు.. అతడి కుటుంబ సభ్యులు ఆనందంతో ఉబ్బి తబ్బుబ్బిపోయారు. తనకు ఇచ్చిన చెక్ తీసుకొని బ్యాంక్ కు వెళ్లాడా విద్యార్థి.
అయితే.. బ్యాంక్ కు వెళ్లిన విద్యార్థిని ఊహించని షాక్ తగిలింది. చెక్ బౌన్స్ అయ్యిందని.. చెక్ మీదున్న సంతకం తేడాగా ఉండటంతో దాన్ని రిటర్న్ చేసినట్లుగా చెప్పిన అధికారులు.. విద్యార్థి చేత ఫైన్ కట్టించారు. బహుమానం కాస్తా అవమానంగా మారటంతో విద్యార్థితో సహా అతడి కుటుంబ సభ్యులు షాక్ తిన్నారు. ఈ ఉదంతంపై స్పందించిన డీఐఓఎస్ విద్యార్థికి మరో కొత్త చెక్కు ఇచ్చారు. ముఖ్యమంత్రి చేతుల మీదుగా ఇచ్చే చెక్ విషయంలోనూ అధికారులు ఇంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తారా? అన్న విమర్శను పలువురు చేస్తున్నారు.