Begin typing your search above and press return to search.
మళ్లీ ఉస్మానియాలో ఉద్రిక్త పరిస్థితులు
By: Tupaki Desk | 27 Feb 2016 11:43 AM GMT ఉద్యమాల వర్సిటీ ఉస్మానియాలో మరోసారి ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. తెలంగాణ ఉద్యమ సమయంలో నిత్యం అట్టుడికిన ఉస్మానియా ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తరువాత చల్లబడింది. అయితే, తాజాగా కొత్త ప్రభుత్వం గ్రూప్ 2 ఉద్యోగాల భర్తీకి కొత్త విధానం తేవాలనుకుంటున్నట్లు సమాచారం రావడంతో విద్యార్థులు భగ్గుమన్నారు. కాంట్రాక్టు ఉద్యోగులకు ఈ పోస్టుల్లో వెయిటేజి ఇవ్వాలని కేసీఆర్ సర్కారు అనుకుంటోందని తెలిసి విద్యార్థులు నిరసనలకు దిగారు. భారీ ర్యాలీ తీసేందుకు ఏర్పాట్లు చేసుకున్నారు.
ఉస్మానియాలో ర్యాలీ సమాచారం అందగానే పోలీసులు భారీగా మోహరించారు. అయినా, విద్యార్థులు ఏమాత్రం లెక్క చేయకుండా ర్యాలీకే తీశారు. ర్యాలీ ఎన్ సీసీ గేటు వద్దకు రాగానే పోలీసులు వారిని అడ్డకున్నారు. దీంతో ఇద్దరి మధ్య వాగ్వాదం, తోపులాట జరిగింది. దీంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. ర్యాలీ ఉద్రిక్తతకు దారితీయడంతో కొందరు విద్యార్థులను పోలీసులను అరెస్టు చేసి స్టేషన్ కు తరలించారు. అనంతరం విద్యార్థులను చెదరగొట్టారు.
నియామకాల విషయంలో ప్రభుత్వం తీరు మారకపోతే మరిన్ని ఉద్యమాలు చేయడానికి సిద్దమేనని ఓయూ విద్యార్థులు చెబుతున్నారు. దీంతో ఓయూ మళ్లీ ఉద్యమాల బాట పడుతుందా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.