Begin typing your search above and press return to search.
తమిళనాట మరో జల్లికట్టు!
By: Tupaki Desk | 6 Sep 2017 5:14 AM GMTపట్టిన పట్టు విడవరనే పేరు పొందిన తమిళనాడు జనాలు సరిగ్గా కొన్నాళ్ల కిందట జల్లికట్టు విషయంలో దేశం మొత్తం దృష్టి ని ఆకర్షించేలా పోరు చేశారు. ఎక్కడికక్కడ విద్యార్థులు - ఉద్యోగులు కూడా రోడ్ల మీదకి వచ్చి తమ సంప్రదాయ క్రీడ అంటూ పెద్ద ఎత్తున ప్రభుత్వాల్ని గడగడలాడించారు. దీంతో చివరికి ప్రభుత్వాలు దిగిరాక తప్పలేదు. ఇప్పుడు అలాంటి మరో జల్లికట్టు పోరుకే తమిళనాడు ప్రజలు శ్రీకారం చుట్టారు. ఎంబీబీఎస్ లో ప్రవేశాలకు నీట్ పరీక్షను తప్పనిసరి చేస్తూ.. సుప్రీం కోర్టు జారీ చేసిన ఆదేశాలకు వ్యతిరేకంగా పోరాడి.. ప్రాణాలు త్యాగం చేసిన విద్యార్థిని అనిత పక్షాన ఇప్పుడు పోరాడుతున్నారు.
న్యాయ పోరాటం చేస్తూ.. విధిలేని పరిస్థితిలో ఆత్మహత్యకు పాల్పడిన అనితకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ తమిళనాడు అంతటా నిరసనలు వెల్లువెత్తాయి. కాలేజీల విద్యార్థులు - పలు రాజకీయ పార్టీలకు చెందిన కార్యకర్తలు చెన్నైలోని పలు ప్రాంతాల్లో మంగళవారం వరుసగా నాలుగో రోజూ ఆందోళనలు చేపట్టారు. కొందరు స్వచ్ఛందంగా తమ దుకాణాలు మూసివేసి అనితకు సంతాపం వ్యక్తం చేశారు. యువకులు - విద్యార్థినులు అని ఫొటోలను - పోస్టర్లను పట్టుకుని వీధుల్లో ప్రభుత్వాలకు వ్యతిరేకంగా ర్యాలీ కూడా చేశారు.
ఇక, ఈ నిరసనలను తగ్గించేందుకు ప్రభుత్వం చేపడుతున్న చర్యలు ఫలితం ఇవ్వడం లేదు. అనిత మృతికి సంతాపం వ్యక్తం చేసిన సీఎం పళనిస్వామి ఆమె కుటుంబంలోని ఓ వ్యక్తికి ప్రభుత్వ ఉద్యోగం కూడా ఇచ్చేందుకు రెడీ అయ్యారు. అదేవిధంగా ఆమె కుటుంబానికి రూ. 7 లక్షల పరిహారం ప్రకటించారు. అయితే, దీనిని అనిత కుటుంబం తిరస్కరించింది. మరో పక్క ఈ విషయం రాజకీయ రంగు పులుముకుంటోంది. నీట్‌పై చర్చిచేందుకు ఈ నెల 8న అఖిలపక్ష బహిరంగ సభను నిర్వహించాలని డీఎంకే నిర్ణయించింది. మరి వీరు దీనిని ఏ దశకు తీసుకువెళ్తారో చూడాలి. నీట్ పై ఒక్క తమిళనాడే కాకుండా తెలంగాణ, ఏపీ కూడా గతంలో విభేదించాయి. అయితే, కేంద్రం మాత్రం వీరి ప్రతిపాదనను పరిగణనలోకి తీసుకోలేదు. సుప్రీం కోర్టు కూడా నీట్ ను సమర్ధించింది. మరి ఇప్పుడు ఈ విషయంలో ఎలాంటి మలుపులు చోటు చేసుకుంటాయో చూడాలి.