Begin typing your search above and press return to search.
గల్లీకి వస్తే ఏపీ ఎంపీల్ని తరిమికొడతారంట!
By: Tupaki Desk | 25 Aug 2015 1:34 PM GMTఏపీ ఎంపీలకు పెద్ద కష్టమే వచ్చి పడేట్లు కనిపిస్తోంది. ఏపీకి ప్రత్యేక హోదా సాధించాల్సిన క్లిష్టమైన.. కష్టమైన వ్యవహారం వారి మీద పడింది. ఎన్ని ప్రయత్నాలు చేసినా.. ఏపీకి ప్రత్యేక హోదా ఇచ్చేందుకు కేంద్రంలోని మోడీ సర్కారు ససేమిరా అంటున్న నేపథ్యంలో.. ఏపీకి ప్రత్యేక హోదా రావటం కష్టమేనని తాజాగా తేలిపో్యింది.
దాదాపు గంటన్నరసేపు మోడీతో ఏపీ సీఎం చంద్రబాబు మాట్లాడినా.. ఏపీకి ప్రత్యేకహోదా వస్తుందన్న ఓ చిన్నఆశ పూర్తిగా పోయినట్లేనన్న విషయం ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ.. చంద్రబాబు మాటలు చూస్తే అర్థమవుతుంది.
మరోవైపు విజయవాడలోని బీజేపీ రాష్ట్ర కార్యాలయాన్ని విద్యార్థి జేఏసీ నేతలు ముట్టడించారు. ఈ సందర్భంగా వారు బీజేపీ నేతలపై చెలరేగిపోయారు. ఏపీకి ప్రత్యేకహోదా హామీని బీజేపీ సర్కారు అమలు చేయనంఉకు నిరసనగా వారు బీజేపీ కార్యాలయాన్ని ముట్టడించారు. ఈ సందర్భంగా విద్యార్థిని నేతలు మాట్లాడుతూ.. ఏపీకి ప్రత్యేకహోదా కోసం ఎంపీలు కేంద్రంపై ఒత్తిడి తీసుకురావాలని.. లేదంటే రాజీనామా చేసి ప్రజలతో కలిసి ఉద్యమించాలని వారు డిమాండ్ చేస్తున్నారు.
అంతేకాదు.. ఏపీ ఎంపీలు తమ వ్యాపారాలే ముఖ్యమనుకుంటే ఢిల్లీలోని ఉండాలే తప్పితే.. గల్లీలోకి రావొద్దని.. ఒకవేళ వస్తే మాత్రం తరిమి.. తరిమి కొడతామని హెచ్చరించారు. ఎన్నికల సమయంలో ఏపీకి ప్రత్యేకహోదా ఇస్తానన్న బీజేపీ..అధికారంలోకి వచ్చిన తర్వాత మాత్రం కాలయాపన చేస్తుందని విద్యార్థి నేతలు ఆవేదన వ్యక్తం చే్స్తున్నారు. ఏపీకి ప్రత్యేక హోదా రాదన్నసంకేతాన్ని కేంద్ర సర్కారు స్పష్టం చేస్తున్న నేపథ్యంలో ఏపీలో ఆందోళనలు మరింత ముదిరే అవకాశం ఉందన్న మాట వినిపిస్తోంది.