Begin typing your search above and press return to search.

దేశ వ్యాప్తంగా స్టూడెంట్స్ ఆమె బాటలో..

By:  Tupaki Desk   |   26 Feb 2017 7:51 AM GMT
దేశ వ్యాప్తంగా స్టూడెంట్స్ ఆమె బాటలో..
X
అఖిల భారత విద్యార్థి పరిషత్. సింఫుల్ గా చెప్పాలంటే.. ఏబీవీపీ. దేశ వ్యాప్తంగా అన్ని విశ్వవిద్యాలయంలో ఈ సంస్థకు బలం ఉంది. పవర్ లో బీజేపీ సర్కారు ఉన్న నేపథ్యంలో.. ఏబీవీపీ బలం మరింత పెరిగింది. ఇటీవల రంజాస్ కాలేజీలో జరిగిన విధ్వంసకాండతో ఏబీవీపీ అంటేనే మండిపడుతున్నారు పలువురు విద్యార్థులు. ఇప్పుడా సంస్థ తీరును తీవ్రంగా వ్యతిరేకిస్తూ.. ఒక యువతి చేపట్టిన చర్య.. సోషల్ మీడియాలో పెను సంచలనంగా మారటమే కాదు.. దేశ వ్యాప్తంగా ఉన్నవిద్యార్థులు ఇప్పుడామెను ఫాలో అయిపోతున్నారు.

కార్గిల్ వీర జవాను కెప్టెన్ మన్ దీప్ సింగ్ కుమార్తె.. గుర్ మెహర్ కౌర్ మొదలెట్టిన ప్రచారం ఇప్పుడు పీక్స్ కు వెళ్లింది. ఏబీవీపీ మీద అగ్రహం ఉన్న వారంతా ఆమెకు బాసటగా నిలవటమే కాదు.. ఆమె చేసినట్లే చేస్తూ.. ఆమె వెంట తామంతా ఉన్నామన్న సందేశాన్ని ఇస్తున్నారు. ఇంతకీ కౌర్ ఏం చేశారంటే.. ఒక ప్లకార్డుతో ఫోటో దిగిన ఆమె..దాన్ని తన ఫేస్ బుక్ ప్రొఫైల్ పిక్ గా మార్చారు.

ఇంతకీ ఆమె చేతపట్టిన ప్లకార్డులో ఏం ఉందంటే.. ‘‘నేను ఢిల్లీ వర్సిటీ విద్యార్థిని. నేను ఏబీవీపీ భయపడటం లేదు. నేను ఒంటరిని కాదు. భారతదేశంలోనిప్రతి విద్యార్థి నాతో ఉన్నారు’’ అంటూ ఆమె తన సందేశాన్ని ఎఫ్ బీలో పెట్టారు. ‘‘స్టూడెంట్స్ ఎగనైస్ట్ ఏబీవీపీ’’ హ్యాష్ టాగ్ తో మొదలెట్టిన ఈ క్యాంపైన్ ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షితోంది. ఏబీవీపీని తప్పు పట్టేవారు.. దాన్ని వ్యతిరేకించే వారంతా ఏకమయ్యారు. దేశ వ్యాప్తంగా వివిధ కాలేజీలకు చెందిన విద్యార్థులు.. తమ వివరాలతో ప్లకార్డు పట్టుకొని.. ఫోటోలు దిగుతూ.. తమ సోషల్ మీడియా పేజీల్లో పోస్ట్ చేస్తున్నారు. ఈ క్యాంపైన్ అధికారంతో ఇష్టారాజ్యంగా వ్యవహరించాలనుకునే వారికి చెంపపెట్టు లాంటిదని అభివర్ణిస్తున్నారు.

ఇక.. గుర్ మొహర్ కౌర్ విషయానికి వస్తే.. కార్గిల్ వార్ లో ఆమె తండ్రి మరణించే సమయానికి ఆమెకు రెండేళ్లు మాత్రమే. ఆ మధ్యన భారత్ – పాక్ మధ్య శాంతి నెలకొనాలంటూ ఆమె సైలెంట్ గా ప్రదర్శించిన ప్లకార్డులు అప్పట్లో వైరల్ గా మారి సంచలనాన్ని సృష్టించాయి. తాజా ప్లకార్డు నిరసన ఏబీవీపీని ఉక్కిరిబిక్కిరి చేస్తోంది.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/