Begin typing your search above and press return to search.

లైంగిక వేధింపులు ఆపాల‌ని విద్యార్థినుల దీక్ష‌లు

By:  Tupaki Desk   |   17 May 2017 12:30 PM GMT
లైంగిక వేధింపులు ఆపాల‌ని విద్యార్థినుల దీక్ష‌లు
X
హర్యానాలోని ఓ ఆశ్చ‌ర్య‌క‌ర‌మైన దీక్ష‌కు ఎట్ట‌కేల‌కు ప్ర‌భుత్వం దిగివ‌చ్చింది. హ‌ర్యానాలోని రెవారి జిల్లాలో టీనేజ్ అమ్మాయిలు వేధింపుల‌కు పాల్ప‌డుతున్న పురుషుల‌పై పోరాటం చేప‌ట్టారు. ఆక‌తాయిల ఆగ‌డాలు ఎక్కువ‌య్యాయని అవి త‌ట్టుకోలేక‌పోతున్నామంటూ సుమారు 13 మంది విద్యార్థినులు స్కూళ్లోనే నిరాహార‌ దీక్ష చేప‌ట్టారు. ఏడు రోజులుగా వాళ్లు ఈ దీక్ష‌లో ఉండ‌టంతో ప్ర‌భుత్వం దిగివ‌చ్చింది.

రెవారి జిల్లాలోని ఓ గ్రామ విద్యార్థినులు ఉన్న‌త పాఠ‌శాల చ‌దువు కోసం మ‌రో గ్రామం వెళ్తున్నారు. అయితే అక్క‌డ స్థానికుల నుంచి వేధింపులు ఎక్కువ‌య్యాయి. దీంతో ఆ విద్యార్థినులు దీక్ష‌కు దిగారు. కేవ‌లం నీళ్లు మాత్ర‌మే తాగుతూ త‌మ ఆందోళ‌న‌ను కొన‌సాగించారు. ప్ర‌భుత్వం లిఖిత‌పూర్వ‌కంగా హామీ ఇచ్చేంత వ‌ర‌కు దీక్ష విర‌మించ‌మ‌న్నారు. నిర‌స‌నతో సంబంధంలేని కొంద‌రు పేరెంట్స్‌, విద్యార్థినులు కూడా ఆ ఆందోళ‌న‌లో జ‌త‌క‌లిశారు. న్యాయం జ‌రిగే వ‌ర‌కు దీక్ష‌ను వీడ‌మ‌ని ప్ర‌తిజ్ఞ చేశారు.

కాగా, వేధింపులు అరిక‌డ‌తామ‌ని, రెవారిలో ఉన్న ప్రభుత్వ ఉన్నత పాఠశాల స్థాయిని 12వ తరగతి వరకూ పెంచుతామ‌ని హర్యానా ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. రేవారి గ్రామంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో చదువుతున్న 86 మంది విద్యార్థినులు ఆందోళన చేపట్టగా అందులో 13 మంది విద్యార్థినులు నిరాహార దీక్ష చేప్టటారు. కాగా ప్రభుత్వం సానుకూలంగా స్పందించి ఆదేశాలు జారీ చేయడంతో విద్యార్థినులు తమ దీక్షను విరమించారు. పాఠశాల స్థాయిని అప్‌ గ్రేడ్‌ చేయడంతోపాటు ప్రిన్స్‌పాల్‌ ను కూడా నియమించామని హర్యానా విద్యాశాఖ మంత్రి రామ్‌ బిలాస్‌ శర్మ చెప్పారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/