Begin typing your search above and press return to search.
పాఠ్యపుస్తకాల్లోకి ఎక్కిన ‘మోడీ ధైర్యం’
By: Tupaki Desk | 20 Jun 2022 1:49 PM GMT2019లో డిస్కవరీ ఛానెల్‌లోని ‘మ్యాన్ వర్సెస్ వైల్డ్’ షోలో ప్రధాని నరేంద్ర మోదీ కనిపించినప్పుడు అందరూ ఆశ్చర్యపోయారు. కానీ చిన్నప్పుడు మోడీ చేసిన సాహసం ఆ ప్రోగ్రాంలో వెల్లడైంది. మోడీ ఒకసారి చిన్నప్పుడు చెరువులో ఈత కొడుతుండగా ఒక మొసలి పిల్లని పట్టుకున్నట్లు ఆ షో హోస్ట్ బేర్ గ్రిల్స్‌కు వెల్లడించాడు.
“చెరువులో స్నానం చేస్తుండగా నీళ్లలో ఒక మొసలి పిల్ల కనిపించింది. నేను దానిని పట్టుకుని ఇంటికి తీసుకెళ్లాను. నా చర్య పట్ల మా అమ్మ సంతృప్తి చెందలేదు. అందుకే మొసలిని తిరిగి చెరువులో పడేశాను” అని మోదీ ఆ కార్యక్రమంలో సాహసికుడు గ్రిల్స్‌తో పంచుకున్నారు.
ప్రధాని మోదీ చేసిన ఈ సాహసోపేత చర్య ఇప్పుడు ఒకటో తరగతి పాఠ్యపుస్తకాల్లోకి ఎక్కింది. తమిళనాడులోని ఓ ప్రైవేట్ స్కూల్ మోదీ తన చిన్నతనంలో చదువుకునేటప్పుడు ఎంత ‘ధైర్యం’గా ఉండేవాడో పాఠ్యపుస్తకాల్లో ఈ మోదీ కథను పొందుపరిచారు.
“ప్రధానమంత్రి దేశం మొత్తానికి మానిటర్ లాంటివారు. నరేంద్ర దామోదరదాస్ మోడీ భారతదేశానికి 14వ మరియు ప్రస్తుత ప్రధానమంత్రి. అతను తన బాల్యంలో చాలా ధైర్యంగా ఉన్నాడు, ఒకసారి అతను ఒక చిన్న మొసలిని పట్టుకుని ఇంటికి తీసుకువచ్చాడు ” అని తమిళనాడు స్కూళ్లలలో పాఠ్య పుస్తకంలో ఒక పారాలో ప్రచురించారు. దాని క్లిప్పింగ్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
నరేంద్ర మోడీ బాల్యం గురించి మరొక పుస్తకం ఉంది. అది 'బాల్ నరేంద్ర - నరేంద్ర మోడీ బాల్య కథలు అందులో ఉన్నాయి. ఈ పుస్తకంలో ఒక మొసలి మోడీపై దాడి చేయడం.. అతని కాలికి కుట్లు వేసిన అధ్యాయం ఉంది.
మోడీ బాల్యం చాలా విషయాలతో నిండినందున ఇలాంటి కథలకు అంతం లేదు. చాలా చోట్ల వైరల్ అవుతున్నాయి. ప్రధాని మోడీ ధైర్యసాహసాలు స్కూలు పాఠాలుగా బోధిస్తున్నారంటే ఆయన క్రేజ్ ను అర్థం చేసుకోవచ్చు.