Begin typing your search above and press return to search.
స్కూలుకు సెలవు ఇస్తారని ఫ్రెండ్ ను చంపే ప్లాన్!
By: Tupaki Desk | 24 July 2019 7:47 AM GMTవిన్నంతనే వణుకు పుట్టించే ఉదంతంగా దీన్ని చెప్పాలి. రోజులు గడిచిన కొద్ది పిల్లల మనసులు ఇంత విషపూరితంగా ఎలా తయారవుతున్నాయన్న ఆందోళన కలిగించే వైనంగా దీన్ని చెప్పాలి. ఎవరైనా చనిపోతే స్కూల్ కు సెలవు వస్తుందని.. దాంతో ఎంచక్కా ఆడుకోవచ్చన్న దుర్మార్గపు ఆలోచన చేసిన పిల్లల వైనం ఇప్పుడు షాకింగ్ గా మారింది.
ఈ దారుణం మంచిర్యాల జిల్లా చెన్నూరులోని కస్తూర్బా ఆశ్రమ పాఠశాలలో చోటు చేసుకుంది. ఈ స్కూల్లో చదువుతున్న ముగ్గురు అమ్మాయిలు.. ఎవరైనా చనిపోతే స్కూల్ కి సెలవు వస్తుందన్న ఉద్దేశంతో తమ స్నేహితురాలైన పన్నెండేళ్ల రమాదేవిని టార్గెట్ చేశారు.
ఆమె గొంతునుపట్టుకొని ముగ్గురు పిల్లలు గొంతు నొక్కి చంపే ప్రయత్నం చేయటంతో భీతిల్లిపోయిన రమాదేవి పెద్దగా కేకలు వేసింది. దీంతో భయపడిపోయిన ముగ్గురు పిల్లలు పారిపోయారు. అనంతరం రమాదేవిని విచారించిన స్కూల్ సిబ్బంది అసలు విషయాన్ని తెలుసుకొని దిగ్భాంత్రికి గురయ్యారు.
హత్యాయత్నం చేయబోయిన పిల్లల్ని స్కూల్ కు పిలిపించిన అధ్యాపకులు వారిని మందలించారు. అనంతరం పోలీసులకు ఫిర్యాదు చేయటంతో వారిపై హత్యాయత్నం కేసు నమోదు చేసి జువైనల్ హోంకు తరలించారు. సెలవు కోసం తోటి స్నేహితురాలిని సైతం చంపేందుకు వెనుకాడని వైనానికి కారణం టీవీ సీరియల్స్ కూడా అని చెబుతున్నారు. పిల్లల్లో నేర ప్రవృతికి కారణంగా మారిన టీవీ సీరియల్స్ మీద ఇప్పటికైనా ఒక కన్నేయాల్సిన అవసరం ఉంది. లేదంటే అందుకు భారీ మూల్యం చెల్లించాల్సి రావొచ్చు.