Begin typing your search above and press return to search.

కాఫీ అతిగా తాగేయకండి..!

By:  Tupaki Desk   |   21 Jan 2021 11:30 PM GMT
కాఫీ అతిగా తాగేయకండి..!
X
కాఫీ తాగే అలవాటు మనలో చాలామందికి ఉంటుంది. పొద్దున్నే ఓ కప్పు కాఫీ తాగందే చాలా మందికి డే స్టార్ట్​ కాదు. కాఫీలో ఉండే కెఫిన్​ అనే పదార్థం మన మెదడును ఉత్తేజపరుస్తుంది. దీంతో మనం చాలా ఉత్సాహంగా ఉంటాం. అయితే చాలామంది ఆఫీసులోనూ కాఫీల మీద కాఫీలు లాగించేస్తుంటారు. గంటకు ఓ కాఫీ తాగితేగానీ వాళ్లకు ఏమీ తోచదు. అయితే కాఫీ అతిగా తాగడం ప్రమాదం అని అధ్యయనాలు చెబుతున్నాయి. కాఫీతో అసిడిటీ, అజీర్తి లాంటి సమస్యలు వస్తాయని ఇప్పటికే చాలా పరిశోధనల్లో తేలింది. రోజుకు ఒకటి రెండు సార్లు కాఫీ తీసుకుంటే పర్వాలేదు కానీ.. అదే పనిగా కాఫీలు తాగడం మంచిది కాదని డాక్టర్లు చెబుతున్నారు.

ముఖ్యంగా గుండెజబ్బులు ఉన్నవాళ్లు కాఫీకి దూరంగా ఉండటం మేలు అని చెబుతున్నారు.కాఫీ తీసుకోవడం వల్ల సాధారణంగా గుండె వేగం పెరుగుతూ ఉంటుంది. దీనివల్ల గుండె సమస్యలు ఉన్నవాళ్లకు ఇబ్బందులు ఎదురయ్యే ప్రమాదం ఉంది. తాజాగా ఓ అధ్యయనంలో కాఫీతో మనిషి ప్రాణాలకు కూడా ముప్పు వాటిళ్ళుతుందని తేలింది. 70 కిలోల బరువున్న ఓ వ్యక్తి వరసగా 70 కప్పుల కాఫీ తీసుకుంటే అతడు ప్రాణాలు కోల్పోవచ్చని ఈ అధ్యయనం తేల్చింది.

నిజానికి ఎవరూ 70 కప్పుల కాఫీ ఒకేసారి తాగరు. అయినప్పటికీ రోజుకు 20 కప్పులు కాఫీ తాగేవాళ్లు ఉండొచ్చు. ఎందుకైనా మంచిది కాఫీ అతిగా తీసుకోకుండా.. మితంగా తీసుకోవడం ఉత్తమం. గతంలో డాక్టర్లు అదే విషయాన్ని ఎన్నోసార్లు చెప్పారు. తాజాగా వెల్లడైన పరిశోధన కూడా ఇదే విషయాన్ని తేల్చింది.