Begin typing your search above and press return to search.

అమెరికా స్కూల్ పిల్లలు మరీ అంత ముదుర్లా?

By:  Tupaki Desk   |   15 Jun 2016 6:03 AM GMT
అమెరికా స్కూల్ పిల్లలు మరీ అంత ముదుర్లా?
X
షాకింగ్ సర్వే ఒకటి బయటకు వచ్చింది. అమెరికాలోని 16 వేల మంది స్కూల్ విద్యార్థులతో ప్రభుత్వం ఒక సర్వే నిర్వహించారు. ఈ సర్వేను.. వారి తల్లిదండ్రుల అనుమతితో కొన్ని ప్రశ్నల్ని సంధించారు. తాజాగా విడుదలైన సర్వే వివరాలు షాకింగ్ గా మారటమే కాదు.. భవిష్యత్ తరాలకు ఈ సర్వే ఒక హెచ్చరికగా చెబుతున్నారు. ఎందుకిలా అంటే.. ఈ సర్వేలో పాల్గొన్న స్కూల్ విద్యార్థులు చెప్పిన వివరాలే కారణమని చెప్పాలి.

అమెరికా స్కూల్ విద్యార్థుల్లో సెక్స్ మీద అవగాహన భారీగా పెరుగుతున్నట్లు తాజా సర్వే తేల్చింది. దాదాపు 125 ప్రభుత్వ.. ప్రైవేటు స్కూళ్లలో 16 వేల మందితో నిర్వహించిన ఈ సర్వేలో విద్యార్థులు తాము తరచూ స్మోకింగ్.. డ్రింకింగ్ చేస్తున్నట్లుగా వెల్లడించటంతో పాటు.. డ్రగ్స్ తీసుకుంటున్నట్లు వెల్లడించారు. మరింత షాకింగ్ విషయం ఏమిటంటే.. 13 ఏళ్ల వయసులోనే తాము సెక్స్ చేస్తున్నట్లుగా వారు పేర్కొన్నారు. సెక్స్ అనుభవాన్ని 13 ఏళ్ల వయసులోనే తాము చూసినట్లు చెప్పటమే కాదు.. నలుగురైదుగురితో తాము సెక్స్ చేసినట్లుగా ఒప్పుకోవటం విస్మయానికి గురి చేసే అంశంగా మారింది.

గత సర్వేలో తామిప్పటివరకూ సెక్స్ చేయలేదన్న మాటను 47 శాతం మంది చెబితే.. తాజా సర్వేలో అది కాస్తా 41 శాతంగా తగ్గిపోవటం గమనార్హం. అంతేకాదు సెక్స్ కారణంగా అవాంఛిత గర్భం మీద అవగాహన పెరగటం కూడా గర్భస్రావాల రేటు పెరగకపోవటానికి కారణంగా చెబుతున్నారు. బర్త్ కంట్రోల్ పిల్ ను చాలామంది ఉపయోగిస్తున్నట్లు పేర్కొన్నారు. మరికొందరు సెక్స్ చేసే సమయంలో గర్భం రాకుండా ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు పేర్కొన్నారు. సెక్స్ మీద ఈ తరహా అలవాట్లు భవిష్యత్తు తరాలకు హెచ్చరికగా ఉంటుందని.. దీనిపై అందరూ అలర్ట్ కావాల్సిన అవసరం ఉందంటున్నారు.