Begin typing your search above and press return to search.
‘మిక్స్ అండ్ మ్యాచ్’అధ్యయనం ఏం చెబుతోంది?
By: Tupaki Desk | 19 Oct 2021 6:49 AM GMTమహమ్మారి కరోనాకు చెక్ చెప్పే టీకా ఏదైనా దాదాపుగా రెండు డోసులు తీసుకోవాల్సిన సంగతి తెలిసిందే. ఇలాంటప్పుడు మొదటి డోసులో ఒక వ్యాక్సిన్.. రెండోడోసులో మరో కంపెనీకి చెందిన వ్యాక్సిన్ వేసుకుంటే ఏమవుతుంది? ఇలా వ్యాక్సిన్ వేసుకోవటాన్ని ‘మిక్స్ అండ్ మ్యాచ్’ గా అభివర్ణిస్తారు. అలాంటి కాంబినేషన్ లో వ్యాక్సిన్ వేసుకున్న వారు ఎలా ఉన్నారు. వారి పరిస్థితి ఏమిటి? అలాంటి విధానంలో ఫలితాలు ఎలా ఉన్నాయి? లాంటి ప్రశ్నలకు తాజాగా సమాధానాలు లభిస్తున్నాయి. స్వీడన్ లో చేపట్టిన ఈ అధ్యనానికి సంబంధించిన ఫలితాల్ని తాజాగా లాన్సెట్ జర్నల్ లో ప్రచురించారు.
కోవిడ్ టీకా రెండు డోసుల్లో ఆస్ట్రాజెనెకా అదేనండి కోవిషీల్డ్ ను తీసుకున్న వారితో పోలిస్తే.. ఒక డోసు కోవిషీల్డ్.. మరో టీకా ఎంఆర్ఎన్ఏ వ్యాక్సిన్ తీసుకుంటే మహమ్మారి ముప్పు తక్కువగా ఉంటుందన్న విషయాన్ని గుర్తించారు. అయితే.. స్వీడన్ కు చెందిన 65 ఏళ్లకు పైబడిన వారిలో ఈ విధానాన్ని అనుసరించినప్పుడు కొందరిలో సైడ్ ఎఫెక్టులు కనిపించాయి. దీంతో.. ఈ తరహా వినియోగాన్ని నిలిపివేశారు.
అయితే.. అప్పటికే ఆస్టాజెనెకా మొదటి డోసుగా తీసుకొని రెండో డోసుగా ఫైజర్ లేదంటే మోడెర్నా టీకాను తీసుకున్నారు. ఇలా వేర్వేరుగా టీకా డోసుల్ని తీసుకున్న ఏడు లక్షల మంది వివరాల్ని సేకరించి.. వాటిని అధ్యయనం చేపట్టారు. వెక్టార్ బేస్డ్ టీకా (కొవిషీల్డ్)ను మొదటి డోసుగా తీసుకొని.. రెండో డోసుగా ఎంఆర్ఎన్ఏ ఆధారిత వ్యాక్సిన్ ను తీసుకున్న వారిలోని అత్యధికుల్లో కొవిడ్ ముప్పు తగ్గుతున్నట్లు గుర్తించామని చెబుతున్నారు.
ఈ అధ్యయనంలో కొవిషీల్డ్.. ఫైజర్ వ్యాక్సిన్లనున కలిపి తీసుకున్న వారిలో కొవివ్ ఇన్ఫెక్షన్ ముప్పు 67 శాతం తగ్గుముఖం పట్టినట్లుగా గుర్తించారు. అదే సమయంలో కొవిషీల్డ్.. మోడెర్నా వ్యాక్సిన్లను వేర్వేరు డోసులుగా తీసుకున్న వారిలో అసలు టీకా తీసుకోని వారితో పోలిస్తే కొవిడ్ ముప్పు 79 శాతం తగ్గుతుందని గుర్తించారు.
రెండు డోసుల్లోనూ కొవిషీల్డ్ తీసుకున్న వారిలో కొవిడ్ ముప్పు కేవలం 50 శాతం మాత్రమే తగ్గుతుందని తేల్చారు. సో.. మిక్స్ అండ్ మ్యాచ్ విధానం బాగానే పని చేస్తుందని తేలింది. కానీ.. మన దేశంలో అలాంటి వాటికి అనుమతి లేదు. అయితే.. ఈ అధ్యయన వివరాల ఆధారంగా నిపుణుల సలహాలు.. ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా వేర్వేరు టీకాలు వేయించుకోవటం ఏ మాత్రం మంచిది కాదన్నది మాత్రం మర్చిపోకూడదు.