Begin typing your search above and press return to search.
వ్యాక్సిన్ పనితీరుపై అధ్యయనం.. షాకింగ్ విషయాలు వెళ్లడి
By: Tupaki Desk | 28 Jun 2021 12:30 AM GMTకరోనా వ్యాక్సిన్ తీసుకున్నాం.. ఇక మాకు దిగులు లేదు ఇబ్బంది అంతకంటే లేదు అని కొందరు భావిస్తున్నారు. కరోనా ఇక తమను ఏమీ చేయలేదు అంటూ వ్యాక్సిన్ తీసుకున్న వారు ధీమాగా తిరుగుతున్న ఈ సమయంలో ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ చేసిన మొదటి అధ్యయనం లో షాకింగ్ విషయాలు వెళ్లడి అయ్యాయి.
సెకండ్ వేవ్ మొదలు అయిన తర్వాత అంటే మార్చి నుండి జూన్ వరకు వ్యాక్సిన్ తీసుకున్న వారిపై అధ్యయం చేయగా వారిలో ఏకంగా 76 శాతం మందికి కరోనా మళ్లీ సోకినట్లుగా నిర్థారణ అయ్యింది. రెండు డోసుల వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత కరోనా సోకిన వారిలో 16 శాతం మందికి ఎలాంటి లక్షణాలు లేవు.. 10 శాతం మంది మాత్రం సీరియస్ అయ్యి ఆసుపత్రిలో చేరారు. ఇక మిగిలిన వారు స్వల్ప లక్షణాలతో వారం నుండి రెండు వారాల మద్యలో కోలుకున్నారు.
వ్యాక్సిన్ తీసుకుంటున్న వారిలో కొద్ది శాతం మందికి అస్సలు యాంటీ బాడీస్ కనిపించడం లేదని ఈ అధ్యయనంలో వెళ్లడి అయ్యింది. దేశ వ్యాప్తంగా మొత్తం 361 మందికి ఆర్టీ పీసీఆర్ టెస్టును చేయగా అందులో 277 మందికి పాజిటివ్ అని తేలింది. వీరందరు కూడా రెండు డోసుల వ్యాక్సిన్ పూర్తి అయిన వారే కావడం విశేషం. కోవిషీల్డ్ తో పోల్చితే కోవాగ్జిన్ లో యాంటీబాడీస్ రేటు తక్కువ ఉన్నాయని ఐసీఎంఆర్ నివేధికలో పేర్కొన్నారు. ఆరోగ్య కార్యకర్తలు పలువురు రెండు డోసుల వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత కూడా వైరస్ బారిన పడ్డ విషయాన్ని ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ వెళ్లడించింది.
మహారాష్ట్రకు చెందిన ఒక వ్యక్తి వ్యాక్సిన్ రెండు డోసులు తీసుకున్న తర్వాత కూడా కొన్నాళ్లు ఆరోగ్యంగా ఉండి కరోనాతో మృతి చెందినట్లుగా స్థానిక ప్రభుత్వం పేర్కొంది. వ్యాక్సిన్ రెండు డోసులు తీసుకున్న తర్వాత కరోనా సోకిన వారిలో దాదాపుగా 10 శాతం మంది ఆసుపత్రిలో చేరి చికిత్స తీసుకోవాల్సి వచ్చింది. వారు అంతా కూడా 11 రోజుల్లో కరోనా ఫ్రీ అయ్యారు. కరోనా వల్ల వారికి తీవ్ర లక్షణాలు ఏమీ ఏర్పడలేదు. కాని రెండు డోసుల వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత కూడా కరోనా పాజిటివ్ రావడం అనేది ఆలోచించాల్సిన విషయంగా నిపుణులు చెబుతున్నారు.
ఇక దీనికి కారణం కొందరు డెల్టా వేరియంట్ అనే ప్రచారం కూడా చేస్తున్నారు. ఏది ఏమైనా వ్యాక్సిన్ వేసుకుంటే కొంతలో కొంత అయినా సురక్షితం అని మాత్రం చెప్పుకోవచ్చు. అందుకే సాధ్యం అయినం త్వరగా దేశ వ్యాప్తంగా వ్యాక్సినేషన్ ను పూర్తి చేయాలని ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తుందని నిపుణులు చెబుతున్నారు.